నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు రెండో రోజు ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యంగ్ ఇండియా నాన్ ప్రాఫిట్ సంస్థ అని, సంస్థ నిర్వాహకులకు కూడా ఒక్క రూపాయి తీసుకునే హక్కు లేదని ఆయన వెల్లడించారు. నెహ్రూ ఆశయం కోసం నడపడం కోసమే పత్రిక నడిపిస్తుందని, ప్రభుత్వం నుండి లబ్దిపొందిన సంస్థలు కావని ఆయన తెలిపారు. బీజేపీ నుండో.. మోడీ నుండో లబ్ధి పొందలేదని, సోనియా..రాహుల్ గాంధీలు పత్రిక నడిపి… బీజేపీ కుట్రలు ఛేదించడం కోసం నడుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు.
పత్రిక నడిస్తే… మోడీకి ఇబ్బంది అని ఫిర్యాదు చేయించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేస్తే.. ఇందులో పొరపాటు ఏం లేదు అన్నారని, 2017 లో ఈడీకి ఫిర్యాదు చేసినా… మనీల్యాండరింగ్ లేదన్నారన్నారు. ఇందులో ఏమి జరగలేదు కానీ ఏదో జరిగింది అని మోడీ.. కేసీఆర్ ఈడీ నోటీసులు ఇప్పించారని ఆయన మండిపడ్డారు. దేశం కోసం.. ఇందిరా..రాజీవ్ లు ప్రాణాలు అర్పించారు. మతం మీద చేసిన దాడుల నుండి బయట పడేందుకు… ఈడీ నోటీసులు ఇప్పించించారు మోడీ అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.