Couple Kisses Under Water On Valentines Day Sets Guinness World Record: ప్రతిఒక్కరిలోనూ తమకంటూ ప్రత్యేక ట్యాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుబోయే జంట అయితే ముద్దు పెట్టుకోవడంలో దిట్ట. అందుకే.. లిప్ కిస్ విషయంలో ఈ జంట ఏకంగా వరల్డ్ రికార్డ్ కొట్టింది. వ్యాలెంటైన్స్ రోజున ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనుకున్న వాళ్లు.. తమకున్న ‘ముద్దు’ ట్యాలెంట్‌తో సత్తా చాటాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ముద్దులో తమ ప్రతిభ చాటి.. ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిపోయారు. అయినా.. ముద్దు విషయంలో ఆ జంట చేసిన అంత ప్రత్యేకత ఏమిటా? అని ఆలోచిస్తున్నారా! అందరిలా వీళ్లేమీ సాదాసీదా ముద్దు పెట్టుకోలేదు.. నీటి అడుగున 4 నిమిషాలకు పైగా ఊపిరి బిగపట్టి, ముద్దు పెట్టుకున్నారు. అందుకే ఆ జంట గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Surekha Vani: కూతురుతో వెకేషన్లు సరే.. డబ్బులెవరిస్తున్నారు ఆంటీ
దక్షిణాఫ్రికాకు చెందిన బెత్ నీల్, కెనడాకు చెందిన మైల్స్ క్లౌటియర్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే కలిసి నివసిస్తున్నారు. ఈ ఏడాది వాలెంటైన్స్ రోజున ఏదో ఒకటి చేయాలని వీళ్లు సంకల్పించుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి ఓ ఐడియా తట్టింది. నీటి అడుగున ఎక్కువసేపు ముద్దు పెట్టుకొని, గిన్నిస్ రికార్డ్ సృష్టించాలని అనుకున్నారు. ఇందుకోసం వాళ్లు మాల్దీవ్స్‌కి వెళ్లి, అక్కడి కొన్ని వారాల పాటు సాధన చేశారు. ఫైనల్‌గా తాము ఇది చేయగలమన్న నమ్మకం వారికి కలిగింది. ఇంకేముంది.. ఈరోజు (వాలెంటైన్స్ డే) మాల్దీవ్స్‌లోనే వీళ్లిద్దరు ఓ పూల్ అడుగుభాగంలో మోకాళ్లపై కూర్చొని, 4 నిమిషాల 6 సెకన్ల పాటు ముద్దు పెట్టుకున్నారు. దీంతో.. నీటి అడుగున ఎక్కువసేపు ముద్దు పెట్టుకున్న జంటగా వీళ్లు గిన్నస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు.
Komatireddy Venkat Reddy: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. బీజేపీ రాజకీయం చేస్తోంది
ఇంతకుముందు ఒక జంట 3 నిమిషాల 24 సెకన్ల పాటు నీటి అడుగున ముందు పెట్టుకుని.. వరల్డ్ రికార్డ్ సృష్టించారు. 13 ఏళ్ల పాటు ఈ రికార్డ్ చెక్కుచెదరలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నీల్, మైల్స్ జంట ఆ రికార్డ్‌ని బద్దలుకొట్టింది. నిజానికి.. ఈ జంట మూడేళ్ల క్రితమే ఈ ఐడియాతో తమను సంప్రదించారని గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ అఫీషియల్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇక ఈ రికార్డ్ సాధించిన తర్వాత.. తాము అనుకున్నదానికంటే ఇది పెద్ద ఛాలెంజింగ్‌గా సాగిందని ఆ జంట పేర్కొంది. ఈ రికార్డ్ కోసం బెత్, నీల్స్ ఉదయం 7:30 గంటల నుంచి ట్రయల్స్ మొదలుపెట్టారు. చివరికి అసలైన అటెంప్ట్ స్టార్ట్ చేసి, ఈ ఫీట్‌ని సాధించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ వీడియోను తన అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది.