Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
- జూనియర్ డాక్టర్ల సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం మద్దతు
- 15 శాతం స్టైపెండ్ పెంపు కోరితే 3 శాతమేనా?
- ప్రభుత్వంతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు
- సీఎం చంద్రబాబు, ఆరోగ్య మంత్రికి వైద్యుల విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors Strike : విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 2009 జీవో నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు చేపట్టాల్సి ఉందని, కనీసం 15 శాతం పెంచాలని కోరితే ప్రభుత్వం కేవలం 3 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం వైద్యులను తీవ్రంగా అవమానించడమేనని జూనియర్ వైద్యుల సంఘం విశాఖ అధ్యక్షుడు దినకర్ మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, అందుకే తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెను కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అహోరాత్రులు సమయంతో సంబంధం లేకుండా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
సమ్మె మరింత తీవ్ర రూపం దాల్చకముందే ప్రభుత్వం పునరాలోచించి మేల్కోవాలని, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు నిలిచిపోయే దుస్థితి తెప్పించవద్దని వైద్య సంఘాల నాయకులు హెచ్చరించారు. ఏపీ జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు డిమాండ్లను వెంటనే నెరవేర్చడంతో పాటు, డాక్టర్ల పదవీ విరమణ వయోపరిమితిని 62 ఏళ్లకు పరిమితం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న పాలకులు చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరిస్తేనే విధుల బాట పడతామని, లేని పక్షంలో తమ పోరాటం ఆపేది లేదని జూనియర్ వైద్యులు కుండబద్దలు కొట్టారు.
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!