Rajnath Singh: బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కిషన్ రెడ్డి ఎంపీ అయ్యాక సికింద్రాబాద్ ఎలా డెవలప్మెంట్ అయ్యిందో చూస్తున్నామని తెలిపాడు. కిషన్ రెడ్డి అందరిలా కాదు.. ఆయన అవినీతి నాయకుడు కాదన్నారు. తెలంగాణ కోసం అనేక మంది చనిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేదన్నారు.
Read also: Viral Food: మీ వెరైటీ తగలెయ్య.. కొబ్బెర చిప్పలో ఇడ్లి.. వీడియో వైరల్..
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామన్నారు. ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదుగుతున్నామని తెలిపారు. 2047 లోపు దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు. మా ప్రభుత్వం వచ్చాకే అయోధ్య రామ మందిరం కట్టామన్నారు. రామ రాజ్యం వచ్చిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేశాం.. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు స్వేచ్ఛగా భారత ప్రభుత్వంలో ఉందన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం.. CAAను తీసుకువచ్చామని పేర్కొన్నారు. బీజేపీ దేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య పార్టీ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే.. అక్కడ మన విద్యార్థులు ఉన్నారని, రెండు దేశాలతో మాట్లాడి.. యుద్ధాన్ని ఆపి విద్యార్థులను తీసుకోవచ్చారు మోడీ అని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేనంతగా దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తీసుకువచ్చామని క్లారిటీ ఇచ్చారు.
Read also: Etela Rajender: కిషన్ రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసు.. మతం, కులం రంగు లేదు..
గతంలో 33% రిజ్వరేషన్ ఇస్తామని అన్నారు కానీ ఇవ్వలేదు కాంగ్రెస్ అన్నారు. మోడీ వచ్చారు.. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. దేశం ఇప్పుడు అత్యంత శక్తి వంతమైనదిగా అవతరించిందన్నారు. రక్షణ వ్యవస్థలో అత్యంత శక్తివంతంగా తయారు అయ్యామన్నారు. కిషన్ రెడ్డి నాతో పాటు పని చేశారన్నారు. మీ సమస్యలను.. మీ ఆలోచనలు కిషన్ రెడ్డి పార్లమెంట్ లో వినిపిస్తారని తెలిపారు. కిషన్ రెడ్డిని గెలిపించండి అని కోరారు. మల్కాజ్ గిరి అభ్యర్థిగా ఈటెలను గెలిపించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పని చేశాడని, బీఆర్ఎస్ అవినీతిని చూసి బయటకు వచ్చేశాడని కీలక వ్యాఖ్యలు చేశారు.
Raghunandan Rao: హరీష్ రావు గట్టు మీద నిల్చున్నాడు.. కాంగ్రెస్ లోకా లేక..?