Raghunandan Rao: హరీష్ రావు గెట్టు మీద నిల్చున్నాడు కాంగ్రెస్ లోకి పోతాడా అందులోనే ఉంటాడా తెల్వదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘు నందన్ రావు మాట్లాడుతూ.. రఘునందన్ రావు దుబ్బకలో ఓడిపోవడం ఎంత నిజమో.. కామారెడ్డిలో కేసీఆర్ ని బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజం అన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరు… మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్ళు జైల్ కి వెళ్ళక తప్పదని అన్నారు. రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? లేదా ఖాళీ బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గట్టు మీద నిల్చున్నాడు.. కాంగ్రెస్ లోకి పోతాడా అందులోనే ఉంటాడా తెల్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు బీజేపీ అభ్యర్థులు రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్.. ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌లో నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ లోక్ సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి కోట శ్యామ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లోకి నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. తెలంగాణలో ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29 కాగా.. మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Prakash Goud: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ప్రకాశ్ గౌడ్