Bharat Jodo Yatra: తెలంగాణలో రెండో రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ శివారులోని సబ్‌స్టేషన్ నుంచి యాత్రం ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా.. ఒగ్గు కళాకారుల్ని రాహుల్ కలిశారు. ఒగ్గుడోలు మెడలో వేసుకుని డోలును వాయించారు. ఒగ్గు డోలు వాయిస్తూ కళాకారల్ని ఉత్సాహపరిచారు రాహుల్ గాంధీ. కాసేపు వారితో సరదాగా గడిపారు. పాదయాత్రలో వున్న ప్రజలకు ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు రాహుల్ గాంధీ. ఇవాళ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైంది. కన్యకాపరమేశ్వరి ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. బండ్లగుంట వద్ద రాహుల్ లంచ్ అనంతరం రాత్రి గుడిగండ్ల గ్రామంలో రాహుల్ సభ నిర్వహించనున్నారు. మొదటిరోజు 26 కి.మీ రాహుల్ పాదయాత్ర సాగనుంది.
Read also: Ration Mafia: రూట్ మార్చిన రేషన్ మాఫియా.. రైళ్లలో సరిహద్దులు దాటుతోన్న బియ్యం..!
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 2019 డిసెంబర్ 27న జరిగిన జాతీయ గిరిజన నృత్యోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గిరిజన నృత్యోత్సవ వేడుకల సందర్భంగా వేదికను అలంకరించిన రాహుల్.. కాసేపు ఆదివాసీ గెటప్‌లో దర్శనమిచ్చారు. ఆదివాసీల డోలును వాయిస్తూ వేదికపై కలియదిరిగారు. ఆదివాసీలతో కలసి స్టెప్పులేసిన విషయం తెలిసిందే.