బండిసంజయ్ అరెస్టు పై బీజేపీఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ ..కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. డిసెంబర్ 25న కోవిడ్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు తరవాత కేసీఆర్ నల్గొండ పర్యటనకు వెళ్లారు… మాస్క్ లేదు.. వేల మంది హాజరయ్యారన్నారు. ఆ తర్వాత ktr నల్గొండ జిల్లాకు వెళ్లారు. నిబంధనలు ఉల్లంఘించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్‌కు మాస్క్ లేదు. నిన్న కరీంనగర్‌లో గంగుల కమలాకర్ ప్రెస్‌మీట్ పెట్టాడు మాస్క్ లేదు. వీరికి వర్తించని నిబంధనలు తన కార్యాలయంలో బండి సంజయ్ జాగరణ కార్యక్రమం తలపెడితే వర్తిస్తుందా అంటూ ఫైర్ అయ్యారు. కరీంనగర్ సీపీ వివాదాస్పదుడని, కరీంనగర్ సీపీ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షించబడదన్నారు. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ఎంపీ వేల మందితో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంత మంది మీద కేసు పెట్టారని ప్రశ్నించారు.
Read Also:ఉద్యోగుల స్థానికతలో ఇబ్బందులు వస్తే పిల్లల స్థానికత మారుతుంది: జీవన్‌రెడ్డి
డీజీపీ గారు మీరు కూడా సోకు ఉంటే రాజకీయాల్లోకి రండి… అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు కూకట్ పల్లి కమిషనర్‌గా పనిచేసేందుకో… భర్తలకు ఉద్యోగ పొడగింపు కోసమో… ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్న అంటూ రఘునందన్ రావు అన్నారు. పదవుల కోసం పెదవులు మూయకండి అంటూ..రఘునందన్‌రావు ఉద్యోగులను కోరారు.