ఉద్యోగుల స్థానికతలో ఇబ్బందులు వస్తే పిల్లల స్థానికత మారుతుంది: జీవన్‌రెడ్డి


నూతన జోన్, జిల్లాలవారీగా ఉద్యోగుల కేటాయింపులు జరిగినప్పుడు స్థానికత ఆధారంగా చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఉమ్మడి కరీంనగర్‌లో జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పడిందన్నారు. జగిత్యాలలో ఉద్యోగం చేస్తున్న అతను ఇంకో జిల్లాకు కేటాయించారు. ఉద్యోగుల స్థానికతలో ఇబ్బందులు వస్తే పిల్లల స్థానికత కూడా మారుతుందన్నారు.

Read Also: ఫాంహౌస్‌లో కూర్చోని రాత్రికి రాత్రే జీవోలు తెస్తారా..? : విజయశాంతి

భవిష్యత్‌లో ఉద్యోగ దంపతులకు పిల్లలు పుట్టిన వారి స్థానికత పుట్టిన జిల్లానా … పెరిగిన జిల్లా నా.. లోకల్‌ ఏది అనే కన్ఫ్యూజన్ వస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు కూడా ఇబ్బంది కలుగుతుందన్నారు. జూనియర్ ఉద్యోగుల కేటాయింపుల్లో జిల్లాలో కొత్త ఉద్యోగాలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశంపై మరోసారి ప్రభుత్వం ఆలోచించాలని ఆయన సూచించారు. అకారణంగా ప్రభుత్వ ఉద్యోగుల ఊసురు పోసుకోవద్దన్నారు.

Related Articles

Latest Articles