నేరేడుచర్ల పట్టణంలో మన హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత యంగ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవ మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మన నేరేడుచర్ల పట్టణంలో సుమారు వంద సంవత్సరాల నుండి నేరేడుచర్ల పరిసర గ్రామ ప్రజలకు నీడనిచ్చి ఎంతోమంది తోపుడుబండ్ల వారికి ఉపాధి నిచ్చింది రావిచెట్టు. ఈ రావి చెట్టును నేరేడుచర్ల ప్రజల కోరిక మేరకు రీ ప్లాంటేషన్ చేయాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి విన్నవించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, VATA ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ కృష్ణ చెట్టును చూసి మూడు స్థలాలను పరిశీలించారు.
చెట్టును మార్చడంలో సహాయపడతామని వాతా ఫౌండేషన్ నుండి వాలంటీర్లతో కలసి వారు 4 కొమ్మలను కొత్త చెట్లుగా కూడా పాతడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రజల కోరిక, అధికారుల సలహా మేరకు వారు చూపించిన స్థలంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు రీ ప్లాంటేషన్ చేయడానికి నిర్ణయించామని త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు, డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యశోద రాములు, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, టిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, కౌన్సిలర్స్ వేమూరి నారాయణ, skభాష, తాళ్లూరి సాయి, పార్టీ అధికార ప్రతినిధి వింజమూరి మల్లయ్య, ప్రచార కార్యదర్శి బుడిగే చంద్రయ్య గౌడ్, టిఆర్ఎస్ పట్టణ నాయకులు కట్టా కళావతి, ఎస్.కె కైరున్, తెరాస నాయకులు నాగండ్ల శ్రీధర్, ఆకారపు వెంకటేశ్వర్లు, చిట్యాల శ్రీనివాస్, ఎస్కే సైదా, వింజమూరి రాజేష్, కొమర్రాజు వెంకట్, కొప్పు రామకృష్ణ, తిక్కల శ్రీకాంత్, నందిపాటి మహేష్, మారుపాక నాగరాజు, ఎస్కే రియాజ్, తదితరులు పాల్గొన్నారు.