బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి… 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య.. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ.. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్న బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. బీసీల పట్ల కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం.. బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే లక్ష మందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు..…