హైదరాబాద్‌లోని పీవీమార్గ్‌లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్‌లు ఆవిష్కరించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం అంగరంగవైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీ గురించి కొన్ని విషయాలను పేర్కొన్నారు. పీవీ శతజయంతి వేడుకలు నేటితో ముగుస్తున్నాయని, ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పీవీ ఒక కీర్తి శిఖరం అని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నసమయంలో నవోదయ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ…
దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టి అన్ని దేశాలతో సమానంగా అభివృద్ది చెందేందుకు కృషిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఏడాదిగా శతజయంతోత్సవాలను నిర్వహించిది. ఈరోజు పీవీ జయంతితో శత జయంతి ఉత్సవాలకు ముగింపుపలికారు. ఇందులో భాగంగా ఇప్పటికే నెక్లెస్ రోడ్‌ని పీవీ మార్గ్ మార్చింది ప్రభుత్వం. పీవీ మార్గ్ లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈరోజు ఉదయం11 గంటలకు గవర్నర్…
దేశంలో సంస్కరణలు తీసుకొన్ని, అభివృద్దిబాటలో నడిపించిన ప్రధానీ పీవీ నరసింహారావు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి మరణం తరువాత, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో నెలకొన్న అనిశ్చితి తొలగించేందుకు సమర్ధుడైన వ్యక్తిని ప్రధానిగా నియమించాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. పీవీ ప్రధాని అయ్యాక, అనేక సంస్కరణలు తీసుకురావడంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది దిశగా అడుగులు వేసింది. పీవీ నరసింహారావు తెలుగు వారు కావడం, అందులోనూ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో రాష్ట్రంలో గత ఏడాది కాలంగా…