CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
- జంతర్ మంతర్‌లో సీజేపీ నిరసన స్వరూపంపై చర్చ.
- మత నినాదాలు, ఆయుధాలతో నిహాంగ్‌ల హాజరు.
- సరైన సమన్వయం లేకపోతే ఉద్యమం హైజాక్ అయ్యే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. యువత కూడా జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనకు వస్తున్నారు. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో రెండు వర్గాలు గాయపడ్డాయి. ఈ ఉద్యమంలో ప్రధాన ఎజెండా పేపర్ లీకుల నుంచి విషయం తప్పుదారి పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమంలో యువత పాల్గొంటున్నప్పటికీ, వారితో పాటు కొన్ని మత శక్తులు కూడా ప్రవేశించాయి.
ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద అసలైన ఎజెండా పక్కకు పోయి రామమందిరం, హిందూ దేవతల్ని తిట్టడం, జర్నలిస్టులపై దాడులు, భారత సైన్యంపై విద్వేష వ్యాఖ్యలు, జిహాద్ నినాదాలు వినిపిస్తున్నాయి. కొన్ని శక్తులు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద “జై శ్రీరామ్”, “భారత్ మాతాకీ జై”, “నారా-ఏ-తక్బీర్, అల్లాహు అక్బర్” వంటి మతపరమైన నినాదాలు వినిపిస్తున్నాయి. విద్యార్థి ఉద్యమం మత ఉద్యమంగా మారుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read
- Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
మరోవైపు, నిహాంగ్ సిక్కులు కత్తులు, కిర్పాన్లు, ఈటెలతో కనిపించడం మరింత వివాదాస్పదమైంది. వీటిని ఊపుతూ ప్రదర్శనలు చేయడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు రిటైర్డ్ అధికారులు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమన్వయం లేకపోతే ప్రశాంతమైన ఉద్యమం బయటి శక్తుల ప్రయోజనాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. బుధవారం రాత్రి యూట్యూబర్లపై దాడి, నిరసనకారులు-నిహాంగ్ సిక్కులకు మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుతుండటం మహిళల భద్రతకు ప్రమాదంగా మారింది. ఒక యువతిపై లైంగిక వేధింపులకు ప్రయత్నిస్తున్న వీడియో బయటకు రావడం ఆందోళనకరంగా మారింది. పేపర్ లీక్ అంశాలతో పాటు మతం, ప్రాంతీయ ఉద్యమాలు, రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తుండటం చూస్తే ఉద్యమం అసలు లక్ష్యం బలహీనపడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!