Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- మరింత ఉధృతం అవుతున్న విద్యార్థుల ఆందోళన
- విద్యా్ర్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం
- ఇండియా కూటమి ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత పెంచింది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలో తన నివాసంలో ఇండియా కూటమి నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులర్పించేందుకు గాంధీ స్మృతికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనలు ఉధృతం అయ్యాయి.
విద్యార్థులు ఒంటరివారు కాదు
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. విద్యార్థుల ఉద్యమానికి ప్రతిపక్షం పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘మన విద్యార్థులు రోడ్డుపై ఉన్నారు. అందుకే ప్రతిపక్ష ఎంపీలు కూడా రోడ్డుపైనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇండియా గేట్‌కు వెళ్లాలని అనుకున్నాం. పోలీసులు అనుమతించలేదు. తర్వాత గాంధీ స్మృతికి వెళ్లాలని చెప్పినా మా బస్సును అడ్డుకున్నారు. కానీ మా సందేశం ఒక్కటే.. విద్యార్థులారా.. మేమంతా మీతోనే ఉన్నాం.’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
సమావేశం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. “నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులను స్మరించేందుకు, న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న సమయంలో గాయపడిన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఇండియా కూటమి ఎంపీలు గాంధీ స్మృతికి వెళ్తున్నారు. దేశ విద్యార్థులు ఒంటరివారు కాదు. వారి డిమాండ్లకు ప్రతిపక్షం పూర్తి మద్దతుగా నిలుస్తుంది.” అని పేర్కొన్నారు.
భారీ భద్రత.. బారికేడ్లు
రాహుల్ గాంధీ నివాసం దగ్గర పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోగా.. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలను కూడా మోహరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యను లేవనెత్తకుండా అడ్డుకునేందుకు రాహుల్ గాంధీని గృహ నిర్బంధంలో ఉంచినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలపై చర్యలు తీసుకోవడం బదులు ప్రతిపక్షాన్ని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
సమావేశానికి హాజరైన నేతలు
రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన సమావేశానికి ఆర్జేడీ ఎంపీలు మనోజ్ ఝా, మీసా భారతి, కాంగ్రెస్ నేతలు ప్రమోద్ తివారీ, రణదీప్ సింగ్ సుర్జేవాలా తదితరులు హాజరయ్యారు.
సమావేశానికి ముందు మనోజ్ ఝా మాట్లాడుతూ.. “జంతర్‌మంతర్‌లో దేశంలోని పలు రాష్ట్రాల్లో యువత ఆగ్రహంతో రోడ్డెక్కింది. దేశ పరిస్థితి చూసి ఆందోళన కలుగుతోంది. ఇకపై మేము ఏం చేయబోతున్నామో త్వరలో తెలుస్తుంది.” అని అన్నారు. రణదీప్ సింగ్ సుర్జేవాలా మరోసారి “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్పనిసరి” అని డిమాండ్ చేశారు.
సీజేపీ మరోసారి కేంద్రానికి హెచ్చరిక
ఇదే సమయంలో నీట్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోసారి విజ్ఞప్తి చేస్తూ.. “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను వెంటనే ఆమోదించండి. లేకపోతే ఉద్యమం కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆగదు.. మీ రాజీనామా వరకు వెళ్తుంది.” అని హెచ్చరించారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల కంటే ఒక విఫలమైన మంత్రికి ప్రాధాన్యం ఇస్తే ప్రజలు ఎన్నికల్లో తగిన సమాధానం చెబుతారన్నారు.
మళ్లీ చర్చలకు కేంద్రం ఆహ్వానం.. సీజేపీ నిరాకరణ
మరోవైపు కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానం పలికింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. గత 24 గంటల్లో విద్యార్థి ప్రతినిధులకు నాలుగు సార్లు చర్చల ఆహ్వానం పంపామని, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో సమావేశానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే సీజేపీ నేతలు ఈ ప్రతిపాదనను మరోసారి తిరస్కరించారు. చర్చలు జరగాలంటే జంతర్‌మంతర్ లేదా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వంటి తటస్థ వేదికలో మాత్రమే నిర్వహించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi boards a bus as he, along with opposition MPs, leaves for Gandhi Smriti from his residence pic.twitter.com/BIyXiKkUON
— ANI (@ANI) July 23, 2026
Right now, MPs and leaders of the INDIA alliance are peacefully heading to Gandhi Smriti on Tees January Marg.
We go to remember the students we lost – the children driven to take their own lives after the NEET paper leak.
And we go to stand with the students who lie injured…
— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!