Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
- పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- కుమారుడిని కాపాడేందుకు కుట్ర ఆరోపణలు
- ఏ-3గా మాజీ మంత్రిపై కేసు నమోదు
- అంపోలు జిల్లా జైలుకు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sidiri Appala Raju : శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజుకు పలాస జేఎంఎఫ్సీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు ఆరవ్ వర్మను రక్షించేందుకు కుట్ర పన్నారని, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
తన కుమారుడికి బదులుగా వేరొక వ్యక్తిని నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారని అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆయనపై ఏ-3 నిందితుడిగా వివిధ సెక్షన్ల ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఆయనను పలాస న్యాయస్థానంలో హాజరుపరచగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ ఖరారు చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆయనను అంపోలు జిల్లా జైలుకు తరలించారు. మాజీ మంత్రి అరెస్టు, జ్యుడీషియల్ రిమాండ్ వార్తలతో జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. అటు పోలీసులు జైలు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!