Prajavani: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా సమస్యలను వినేందుకు ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 10గంటల లోపు వచ్చినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎలాగైనా 10గంటల లోపు క్యూలో నిలబడాలని అర్థరాత్రి బయలుదేరుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, భూసమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తేనే తమ సమస్య పరిష్కారమవుతుందని అందుకే వచ్చామని చెబుతున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రజావాణి ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. నగరవాసులే కాకుండా అనేక జిల్లాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజావాణికి వస్తున్నారు. అక్కిడికి వచ్చిన వారిని సరైన దారిలో పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా రద్దీ లేని మార్గం నుంచి పంపిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే వారికి మౌలిక వసతులపై మరింత శ్రద్ధ చూపాలని పిటిషనర్లు కోరుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డుపైనే నిద్రిస్తున్నారని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడి తమ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలు ఇప్పట్లో పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో చలిని సైతం లెక్కచేయకుండా బాధితులు వస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ప్రజాభవన్ వద్ద బారులు తీరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి మంగళ, శుక్రవారాల్లోనే జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఓ బాధితుడు మాట్లాడుతూ… హైదరాబాద్ నుంచి వచ్చానని.. 2019లో సాహిత్య నిర్మాణానికి డబ్బు చెల్లించానని తెలిపాడు. ఇలా మేమందరం చాలా మంది బాధితులు ఉన్నారని తెలిపారు. ఆ కంపెనీ యజమాని డబ్బులు తీసుకుని పారిపోయాడని వాపోయాదు. పోలీసులకు సమాచారం అందించామని కానీ ఎటువంటి ప్రయోజనం లేదని అన్నాడు. మేము రెరాలో ఫిర్యాదు చేసామని అన్నారు. గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా అయినా మా సమస్యలు తీరుతాయని ఇక్కడికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా అయినా మా సమస్యలు తీరుతాయనే నమ్మకం ఉందని అన్నారు.
Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్