Prajavani: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా సమస్యలను వినేందుకు ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 10గంటల లోపు వచ్చినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎలాగైనా 10గంటల లోపు క్యూలో నిలబడాలని అర్థరాత్రి బయలుదేరుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, భూసమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తేనే తమ సమస్య పరిష్కారమవుతుందని అందుకే వచ్చామని చెబుతున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.…