Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
- పదేళ్ల పాలనకు లెక్కలు చెప్పాలి
- బీఆర్ఎస్కు నిరసన చేసే హక్కు లేదు
- సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం
- ప్రజలే బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాలో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న వేళ బీఆర్ఎస్ చేపడుతున్న నిరసనలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
పదేళ్ల అప్పుల పాలనకు లెక్కలు చెప్పాలి.. నిరసనలకు నైతిక హక్కు లేదు
పది సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణను తీవ్ర అప్పులమయం చేసిన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపే నైతిక హక్కు లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారో ప్రజలే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుంటే, గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడికి పోయాయో ప్రజలు వారిని ప్రశ్నించాలని కోరారు. పదేళ్ల పాలనకు లెక్కలు చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ధ్వజమెత్తారు.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం.. ప్రజాపాలనే లక్ష్యం
కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు అందిస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులపై యజమానులుగా గౌరవాన్ని తెచ్చామని, ఇప్పటివరకు 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా ఇచ్చామని వివరించారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం సాధించిన 1000 రోజుల సంక్షేమ విజయాలను చూసి ఓర్వలేకే, భయంతో బీఆర్ఎస్ ఈ నిరసనలు చేస్తోందని, ప్రజలే వారికి తగిన సమాధానం చెబుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!