Ponnam Prabhakar: ఐదు ఏండ్లు ఎంపీగా అధికారంలో ఉండి.. సిరిసిల్ల నేతన్నలకు ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. నేత కార్మికుల కు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి పదవికి కళంకం తెచ్చే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రకటనల వల్ల బీజేపీ పడిపోతుందన్నారు. అబ్ కీ బార్ 400 సీట్లు అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించ వచ్చని, నియంత లాగ ఉండాలని చూస్తున్నారన్నారు. ఏ ఒక్క బలహీన వర్గాలు బీజేపీకి ఓటు వేస్తలేరని తెలిపారు. మంగళ సూత్రాలు గుంజుకుంటుంది అంటున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ స్థాయికి దిగజారి పోయాడన్నారు. కోట్ల రూపాయల ఆస్తులు అదానీ, అంబానికి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Actress Rupali Ganguly: బీజేపీలో చేరిన ఫేమస్ టీవీ నటి రూపాలీ గంగూలీ
మండల కమిషన్ అమలు కాకుండా చేశారన్నారు. కులగణన సర్వేకు అడ్డు చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మన భవిష్యత్తు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకుందామన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఎంపీ సీట్లను గెలిపించుకోవాలన్నారు.
ఎన్నికల కోడ్ ఐపోగానే ఉజ్వలమైన ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 10 ఏండ్ల వరకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఐదు ఏండ్లు ఎంపీగా అధికారంలో ఉండి, బండి సంజయ్ సిరిసిల్ల నేతన్నలకు ఏం చేశావో చెప్పాలన్నారు. ఈ నెల 3న ముఖ్యమంత్రి జన జాతర సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Manda Krishna Madiga: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..