Manda Krishna Madiga: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ని బలపరుస్తూ మందకృష్ణ మాదిగ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన బీజేపీ పార్టీకి పూర్తి మద్దతునిస్తూ.. వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించామన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
Read also: T20 World Cup 2024: కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. నలుగురు బ్యాటర్లు మాత్రమే! అఫ్గానిస్థాన్ జట్టు ఇదే
గత పదెల్లుగా అధికారం అనుభవించిన బిఆర్ఎస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయన్నారు. ఎన్నో సందర్భాలలో మాదిగల హక్కుల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చించిన ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ప్రస్తుత బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల వివరించామన్నారు. అయితే అది విన్న మోడీ వెంటనే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేకాకుండా.. ద్వారా మాదిగల పూర్తి మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి, కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.
Read also: Shalini : అజిత్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షాలిని.. భర్తంటే ఎంత ప్రేమో ..
మరోవైపు మణికొండ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి అన్నారు. రంగారెడ్డిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సంతీత రెడ్డి మాట్లాడుతూ.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని జైన్ కార్టూన్లు క్రీక్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు.
Read also: BJP MP K. Laxman: రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారు..
గత పది సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందిందని అన్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్ల పైచిలుకతో బిజెపి అఖండ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సంగీతారెడ్డి గేటెడ్ కమ్యూనిటీ వాసులను కోరారు.
CM Revanth Reddy: తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు.. రేవంత్ రెడ్డి ట్విట్ వైరల్