Ponguleti Srinivas Reddy : పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల నుంచి నేతలు హాజరయ్యారు. ఒక్కో మండలానికి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రేపటి క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, స్పష్టమైన తేదీలు ప్రకటిస్తాం అని తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.
Maoists : ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ జూన్ 20న బంద్కు మావోయిస్టుల పిలుపు
“ఎన్నికలకు రావడానికి 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కావున, మీరు మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లను వెంటనే గుర్తించి పరిష్కరించి, సిద్ధంగా ఉండాలి,” అని మంత్రివర్యులు సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని సూచించారు. “ప్రజలలోకి సంక్షేమ పథకాల ప్రాధాన్యతను తీసుకెళ్లే బాధ్యత నాయకులదే. ఇప్పటికే అనేక పథకాలు ప్రజల దరి చేరాయి. రాబోయే వారం రోజుల్లో అర్హులైన రైతులకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్, వారి వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది,” అని మంత్రి పేర్కొన్నారు.
మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు, నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా స్థానిక నాయకులదే. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం అన్ని మండలాల నేతలకు ప్రత్యేక సూచనలు చేసిన మంత్రి, గెలుపు కోసం క్రమబద్ధమైన ప్రణాళికతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. ప్రభాకర్, ప్రణీత్లను ఒకేసారి విచారణ