Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. ప్రభాకర్, ప్రణీత్‌లను ఒకేసారి విచారణ
- నాకేం తెలియదు" vs "అతని ఆదేశాలే"
- ఇద్దరినీ కలిసి విచారించనున్న సిట్
- మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల ఆధారాలపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది సిట్. నాకేం తెలీదని ప్రభాకర్ రావు అంటుంటే… ప్రభాకర్ రావు చెప్పిందే తాను చేశానని ప్రణీత్ రావు అంటున్నాడు !! దీంతో… ఇద్దరినీ కలిపి వాచారించాలని భావిస్తున్నారు సిట్ అధికారులు. అలా ఐతే కానీ.. అసలు బండారం బయటపడేలా లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా ప్రభాకర్ రావు పేరు చెప్తుంటే… ప్రభాకర్ రావు మాత్రం తెలీదు… గుర్తులేదు.. మరిచిపోయా… అంటూ సిట్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడట !
ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు.. ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగిరావడంతో కేసు కొలక్కి వస్తుందని భావించారు. కానీ.. ప్రభాకర్ రావు కథ మొదటికి తెచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నిందితులంతా ప్రభాకర్ రావు పేరు చెప్పారు. తన డైరెక్షన్‌లోనే ట్యాపింగ్‌కి పాల్పడ్డామని ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించారు. కానీ.. ప్రభాకర్ రావు మాత్రం తనకేం తెలీదని.. శాఖాపరమైన ఆదేశాలు మాత్రమే ఇచ్చానని చెప్తున్నాడు. అదీకాకుండా… ఉల్టా సిట్ అధికారులనే ప్రశ్నిస్తున్నాడు. నాపై ఉన్నతాధికారులను కూడా ఈ కేసులో ఎందుకు చేర్చలేదని సిట్ అధికారులనే ప్రశ్నిస్తున్నాడు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
దీంతో… సిట్ అధికారులు ఈసారి పక్కాగా ప్లాన్ చేశారు. రెండుసార్లు ప్రభాకర్ రావును విచారించిన సిట్… ఈసారి అనూహ్యంగా ప్రణీత్‌రావును మరోసారి విచారించింది. ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడు అనే వివరాలపై మరోసారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మరుసటి రోజే… అంటే ఈరోజు ప్రభాకర్ రావును మరోసారి విచారణకు పిలిచారు సిట్ అధికారులు. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ప్రభాకర్ రావు ముందుంచి విచారణ స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం తర్వాత ప్రణీత్ రావును కూడా సిట్ కార్యాలయానికి పిలిచి… ఇద్దరినీ ఒకేసారి విచారించాలని భావిస్తున్నారు సిట్ అధికారులు.
రెండోసారి విచారణకు ప్రభాకర్ రావును పిలిచిన సిట్ అధికారులు… తన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, మ్యాక్ బుక్ లను తీసుకురావాలని సూచించారు సిట్ అధికారులు. దీంతో… తాను వాడిన రెండు మొబైల్ ఫోన్లను సిట్‌కు అందజేశారు ప్రభాకర్ రావు. ఆ మొబైల్స్ నుంచి ఏవైనా ఆధారాలు సేకరిస్తే.. వాటిని కూడా ముందుంచి ప్రభాకర్ రావును విచారించనుంది సిట్.
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటల సమయం..!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!