ఖమ్మం జిల్లా కేంద్రం ఇప్పుడు రాజకీయ వైరానికి కేంద్రంగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య వైరం తార స్థాయికి చేరింది. అయితే పోలీసులు ఒక్క పక్షానికే అనుకూలంగా ఉంటున్నారని ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి. అవి నిరసనలకు దారి తీస్తున్నాయి. అధికార పక్షం ప్రతిపక్షంకు చెందిన దిష్టి బొమ్మలను దగ్గం చేస్తే లేని అభ్యంతరాలు బీజేపీ మాత్రం అధికార పార్టీకి చెందిన దిష్టి బొమ్మలను దగ్గం చేయనీయకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల వైఖరితో వైరం ఇంకా పెరుగుతుంది.
గత కొంత కాలంగా ఖమ్మం నగరంలో టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ ల మధ్య వైరం పెరిగింది. గత నెలలో సాయి గణేష్ అనే బీజేపీ యువ నాయకుడు ఆత్మహత్య వ్యవహారం నుంచి ఆ రెండు పార్టీల మధ్య వివాదాలు బాగా పెరిగాయి. బీజేపీ నేతల మీద కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే కేసులను తట్టుకోలేక సాయి ఆత్మహత్య చేసుకోగా, అది తీవ్ర వివాదంగా మారింది. మంత్రి అజయ్ కుమార్ వర్సెస్ బీజేపీగా మారింది. నెల రోజుల నుంచి రెండు పార్టీల మధ్య ప్రెస్ మీట్ లు, ఆందోళనలు సాగుతున్నాయి.
తాజాగా జరిగిన వివాదంలో కూడా పోలీసులు ఒక్కవైపే ఉండడంతో అది ముదిరి పోయింది. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నసాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మీడియా సమావేశంలో మంత్రి అజయ్ కుమార్ పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. విమర్శలు చేశారు. అయితే బండి సంజయ్ విమర్శలకు కౌంటర్ గా నిన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. నడి రోడ్డు మీద, ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్, మేయర్ నీరజ లు పాల్గొన్నారు. సంజయ్ మీద కామెంట్లు కూడా చేశారు. అక్కడే పోలీసులు ఉన్నప్పటికీ దానిని అడ్డుకోవడం కాని మరే చర్య పోలీసులు తీసుకోలేదు..
ఇకపోతే తమ పార్టీ నేత, రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను అధికార పార్టీ వారు దగ్దం చేయడాన్ని బీజేపీ శ్రేణులు తప్పు పట్టాయి. దీనికి నిరసనగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్దం ను అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు. అయితే దిష్టి బొమ్మ దగ్దం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముందే అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్త ఉపేందర్ పెట్రోల్ తన మీద పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు నీళ్లు పోసి ఆసుపత్రికి తరలించారు. కాగా ఇదే సందర్బంలో దిష్టి బొమ్మను దగ్దం చేయడానికి ప్రయత్నించగా మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్బంగా భారీ తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
నగరంలో పోలీసులు ఒక్క పక్షానికే మద్దతు పలుకుతున్నారని అధికార పార్టీ నాయకులు ఏం చేసినప్పటికి పట్టించుకోరన్న విమర్శ ఉంది. అదే ప్రతిపక్ష నాయకులు, క్యాడర్ చిన్న ఆందోళనలు చేసినప్పటికీ కేసులు పెట్టడం ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఆందోళనకు ఒక్క మాదిరిగా, ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలకు మరో విధంగా చేస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి. మొత్తం మీద గత కొంత కాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ల మధ్య వివాదాలు తీవ్రంగా మారాయి. పోలీసులు మాత్రం ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను మూట కట్టుకోవలసి వస్తోంది.
Project K: ప్రభాస్ ఎంట్రీ సీన్.. ప్రాణం పెట్టి తీస్తున్నామన్న డైరెక్టర్