Gold Bag Theft: బైక్ పై వచ్చి సినీ ఫక్కీలో బంగారం బ్యాగ్ చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగలు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుపోతున్నారు. పక్కవారికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా.. చాలా ఈజీగా చోరీలు చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. భద్రాచలంలో అదే జరిగింది. చాలా సులువుగా.. ఏ మాత్రం కష్టపడకుండా.. ఎవ్వరికి కొంచెం కూడా అనుమానం రాకుండా.. బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అంతా అయిపోయాక చూసుకుంటే తన ఆభరణాలు మాయం అయ్యాయని గ్రహించాడో వ్యక్తి.
బూర్గంపాడుకు చెందిన సత్యవ్రత.. భద్రాచలంలోని యూబీరోడ్డులో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కొన్ని రోజుల కింద బంగారు ఆభరణాలు దాచుకున్నాడు. మే 16 మధ్యాహ్నం పదకొండు సమయంలో.. బ్యాంకు లాకర్ నుంచి తన బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. వాటిని ఓ బ్యాగులో పెట్టుకొని ద్విచక్రవాహనానికి తగిలించిన ఓ పెద్ద సంచిలో ఉంచాడు. అక్కడి నుంచి బయలుదేరిన సత్యవ్రత.. ఓ దుకాణం దగ్గర కవర్లు కొనేందుకు ఆగాడు.సత్యవ్రతను ఓ ఇద్దరు యువకులు గమనిస్తూనే ఉన్నారు.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. సత్యవ్రత కవర్లు కొనే దుకాణం దగ్గర అగి. బైక్‌పైనే కూర్చున్న సత్యవ్రత.. ముందుకు మాత్రమే చూస్తూ తనకు కావాల్సింది కొంటున్నాడు. దొంగ మాత్రం.. ఏమాత్రం హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా.. సంచిలో ఉన్న బంగారం బ్యాగును తీసేందుకు ప్రయత్నించాడు. కానీ.. మొదటిసారి ప్రయత్నం విఫలమైంది. చుట్టూ జనసంచారం ఉన్నప్పటికీ ద్విచక్రవాహనదారులు వస్తున్నా ఎలాంటి ఆందోళన పడకుండా.. దొంగ ఇంకోసారి ప్రయత్నించి సక్సెసయ్యాడు. చాకచక్యంగా బంగారం బ్యాగును కొటేశాడు. బ్యాగ్ ని తీసుకుని వెనకకు తిరగకుండా.. హాయిగా నడుచుకుంటూ వెళ్లి అక్కడ అతని కోసం ఎదురుచూస్తున్న మరో దొంగ బైక్ ఎక్కి పరారయ్యాడు. ఆ బైక్ ఎక్కి ఇద్దరు ఎంచక్కా తప్పించుకున్నారు.
కాసేపటి తర్వాత చూసుకోగా.. సంచి బైక్ నుంచి ఊడిపోయినట్టు కనిపించింది. అందులోని బంగారం బ్యాగు మాయం అయ్యింది. తన ఆభరణాల బ్యాగును ఎవరో దొంగిలించారని గుర్తించిన సత్యవ్రత.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగులో లక్షా 80 వేల విలువగల బంగారు ఆభరణాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు కూడా ఉన్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన ప్రదేశంలోని కేసులో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమేరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Langer House: లంగర్ హౌజ్ లో దారుణం… తన ప్రేయసికి హాయ్ చెప్పాడని కత్తితో దాడి
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..