ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా
తీవ్ర ఉత్కంఠగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తెల్లవారు జామున ఫలితాలను అధికారులు వెల్లడించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో మొదటినుంచి వైసీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి ముందంజలో కనిపించినప్పటికీ స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి చాలా బలమైన పోటీ ఇచ్చారు. భారీ అంచనాలు ఉన్న పిడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మూడవ స్థానానికి పరిమితమయ్యారు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి సగం కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి మెజారిటీ వచ్చింది. సుమారు 450ఓట్ల వరకు రామచంద్రారెడ్డి ఆదిక్యం లో ఉన్నారు.
అకాల వర్షం.. ముగ్గురు మృతి.. పంటలు నష్టం
అకాల వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి పిడుగులు పడి కడప గుంటూరు ప్రకాశం జిల్లాలో ముగ్గురు చనిపోయారు. కడప గుంటూరు జిల్లాల్లో పిడుగుపాటుకు వందలాది మేకలు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కర్నూలు జిల్లాల్లో వందలాది ఎకరాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి నాశనం అయిపోయింది. అంతేకాకుండా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పొలాల్లో మినుము ఉండటంతో అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఎక్కువైతే చేతికొచ్చిన మినప పంట చేజారి పోతుందన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది.
వడగళ్ల వానతో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు
తెలంగాణలో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ద్రోణి ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు పడుతున్నాయి. అయితే అకాల వర్షాలకు రైతన్నల్లు లబోదిబో మంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన వేరుశనగ, కల్లాల్లో మిర్చి పంటల అకాల వర్షాలకు తడిసి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇలా పంటలు తడవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో పంటలు తడిస్తే ఎవరు కొనుగోలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు రోజుల పాటు వానలు పడుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు.
లీటర్‌కు బదులుగా అరలీటరు.. హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఆందోళన
పెట్రోల్ బంక్ లో మామూలుగానే మోసాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ లీటర్ పెట్రోల్ బదులు అరలీటర్ వేయడంతో ప్రయాణికులు లబోదిబో మంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ లో గల హెచ్పీ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ లో గల హెచ్పీ పెట్రోల్ బంకులో ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే ఇక్కడే అసలు మోసం బయట పడింది. తను లీటర్ పెట్రోల్ పోయమంటే.. అరలీటర్ పోయడం గమనించాడు. తను లీటర్ వేయమన్నాను కానీ పెట్రోల్ బంక్ నిర్వాహకుడు అరలీటరే పోసాడంటూ నిలదీసాడు.. కానీ.. పెట్రల్ బంక్ నిర్వాహకులు ఎవరూ స్పందించలేదు. అయితే.. విషయం గుర్తించి సదరు యువకుడు వారితో గొడవకు దిగాడు. ఎవరూ సరైన స్పందన లేకపోవడంతో పెట్రోల్ బంక్ లోనే పెట్రోల్ బాటిళ్లతో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ రాజీనామా.. సంస్థలో అనూహ్య మార్పు
దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీసీఎస్ సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కె.కృతివాసన్‌ను ఇన్‌చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు టాటా గ్రూప్‌నకు చెందిన కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. ఆయన రాజీనామాకు గల కారణాలు బయటకు తెలియరాలేదు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజేశ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే రాజేశ్ గోపీనాథన్ ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ టీసీఎస్‌లోనే కొనసాగుతారని, తదుపరి సీఈఓకు మార్గనిర్దేశనం చేస్తారని సంస్థ వెల్లడించింది. ఇక టీసీఎస్ సంస్థకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెస్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న కె.కృతివాసన్ టీసీఎస్ సీఈఓగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషి ఇటీవలే రాజీనామా చేసి టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకమైన నాలుగు రోజుల్లోనే టీసీఎస్ సీఈఓ అండ్ ఎండీ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పనితీరు ఆధారితం కాదు.. ప్రసూతి సెలవులో ఉద్యోగిపై వేటు
గత ఏడాది 11,000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా.. ఇప్పుడు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలో రెండవ రౌండ్ తొలగింపుల వల్ల ప్రభావితమైన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తమ కారణాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ప్రసూతి సెలవులో ఉండగా.. ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మెటా ఉద్యోగి పేర్కొంది. కంపెనీలో మూడేళ్లు పని చేసిన సదరు ఉద్యోగి.. తొలగింపుల కారణంగా తన ప్రసూతి సెలవులు అని తెలిపారు.
టాలెంట్ అక్విజిషన్, రిక్రూటింగ్ టీమ్‌లో భాగమైన సారా ష్నీడర్ అనే యువతి.. కంపెనీలో మూడేళ్లు పని చేసింది. ఈ సమయంలో పెళ్లి, గర్భం దాల్చడం జరిగింది. మెటా లేఆఫ్‌ల కారణంగా మెటాలో నా ప్రసూతి సెలవు తగ్గించబడిందని తెలిపారు. తాను కంపెనీలో 3 సంవత్సరాలు పని చేశానని తెలిపింది. అత్యుత్తమ బృందాలు, నమ్మశక్యం కాని వ్యక్తులతో పనిచేశానని తెలిపింది. తన తొలగింపు పనితీరు ఆధారితమైనది కాదని చెప్పింది. పీపుల్ టీమ్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ టీమ్‌కు రిక్రూట్‌మెంట్‌లో సమయాన్ని వెచ్చించినందుకు తాను గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. దీనికి ముందు, ఆమె ప్రసూతి సెలవు సమయంలో మరో మెటా ఉద్యోగిని కూడా తొలగించారు.
స్వప్నలోక్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా..
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి 5 లక్షల ఎక్స్ గ్రేషియాను సిఎం కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ సూచించారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ట్విస్ట్.. దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు..!
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నా అధికారులకు షాక్ కు గురవుతున్నారు. రోజుకో కొత్త మలుపుతో దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు రావడంతో.. అధికారులు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో కొందరు రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యమయ్యాయని సిట్ దర్యాప్తు అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ పాత్ర కీలకంగా మారిందని అన్నారు. రాజశేఖర్, ప్రవీణ్ కలిసి లక్ష్మీని ట్రాప్ చేశారని అన్నారు. లక్ష్మీ దగ్గర పాస్‌వర్డ్, ఐడీలను దొంగలించారని వెల్లడించారు. మొత్తం ఐదు పేపర్లను కాపీ చేసుకున్నట్లు సిట్ అధికారి తెలిపారు. ఏయే పేపర్లు లీక్ అయ్యాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏఈ పరీక్ష పేపర్‌ను ప్రవీణ్ రేణుకకు అమ్మారని, ఇక గ్రూప్ 1 పరీక్ష పేపర్‌పై దర్యాప్తు చేస్తున్నామని సిట్ అధికారి తెలిపారు. ప్రవీణ్ రాసిన పరీక్షలో అధిక మార్కులు రావడంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ప్రవీణ్ ఎవరెవరికి పేపర్ ఇచ్చారన్నదానిపై విచారణ చేపట్టామని తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్, మరికొందరి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నమాని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు.. గెలుపోటముల మీదా చెల్లని ఓట్ల ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వెలువడే అవకాశం ఉంది. కర్నూలు-అనంతపురం-కడప ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, చిత్తూరు-నెల్లూరు-ప్రకాశం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే షిఫ్టుల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే.. ఇదిలా ఉంటే.. పట్ట భద్రుల ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.