RC 15: సిఈవో వస్తున్నాడు… ఆ సినిమా డబ్బులన్నీ జనసేనకే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న చరణ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ లో పెట్టి షూట్ చేస్తున్నారు. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే RC 15 సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ మార్చ్ 27న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆరోజు చరణ్ బర్త్ డే ఉంది కాబట్టి ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసి అఫీషియల్ గా ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం, ఈ పాన్ ఇండియా సినిమాకి ‘సీఈవో’ (చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) అనే టైటిల్ ని ఫిక్స్ చేసారట. ఈ టైటిల్ ని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఒక గ్లిమ్ప్స్ ని కూడా మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
మార్చ్ 27న RC 15 టైటిల్ రివీల్ తో పాటు, మగధీర సినిమా కూడా రీరిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే మగధీర సినిమాని ఆపేసి, ఆరెంజ్ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రిలీజ్ అయిన సమయంలో ఫ్లాప్ అయిన ఆరెంజ్ మూవీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి కల్ట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఆరెంజ్ మూవీని రీరిలీజ్ చెయ్యమని ఫాన్స్ అడుగుతున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆరెంజ్ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీని చూడడానికి మెగా అభిమానులు ఎగ్జైటింగ్ గా ఉంటారు. అయితే ఆరెంజ్ సినిమా స్పెషల్ షోకి వచ్చే డబ్బులు అన్నింటినీ జనసేన పార్టీ ఫండ్ కి ఇవ్వాలని మెగా అభిమానులు నిర్ణయం తీసుకున్నారు. మరి ఆరెంజ్ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? కల్ట్ క్లాసిక్ ఇమేజ్ ఉన్న ఆరెంజ్ ఎంత హిట్ అవుతుంది అనేది చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!