PM Modi Phone Call to YS Sharmila: వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. ఏం జరుగుతోంది…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వరంగల్‌లో ఆమె యాత్రను అడ్డుకోవడం, దాడి కూడా జరిగిన తర్వాత.. ఒక్కసారిగా వైఎస్ షర్మిలపై ఫోకస్ పెరిగింది.. వరంగల్ ఘటనకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్ షర్మిలను కారుతో పాటు పీఎస్‌కు తరలించడం కూడా చర్చగా మారింది.. అరెస్ట్‌లు, బెయిల్‌పై విడుదల కావడం.. ఆ తర్వాత రోజు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలవడం, డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ.. ఇలా.. వరుసగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు.. అయితే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయడంతో… అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలకు తెరపైకి వచ్చాయి..
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
అయితే, వైఎస్ షర్మిలకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆమెను పరామర్శించారని తెలుస్తోంది.. ఇటీవల జరిగిన ఘటనలు, ఆమెపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు.. అరెస్ట్, కారులో ఉండగానే క్రేన్‌తో పీఎస్‌కు తరలించడం, పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి తదితర అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం.. వైఎస్ షర్మిలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. ఇదే సమయంలో.. అరెస్ట్ చేసినా ఏ మాత్రం బెదరకుండా ధైర్యంగా వ్యవహరించారని ఆమెను ప్రశంసించారని ప్రచారం సాగుతోంది.. దాదాపు 10 నిమిషాల పాటు వైఎస్ షర్మిలతో ప్రధాని మోడీ మాట్లాడారని చెబుతున్నారంటే.. ఇంకా అనేక విషయాలే చర్చకు వచ్చిఉంటాయి అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది..
వరంగల్ ఘటన, అరెస్ట్ తర్వాత వైఎస్ షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లడం.. గవర్నర్ తమిళిసైని కలిసినప్పటి నుంచి ఆమెపై విమర్శలు మొదలయ్యాయి… ఓ వైపు సోషల్ మీడియాలో.. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి షర్మిలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు అర్థమైపోయింది.. షర్మిల ఎవరు వదిలిన బాణమో అంటూ మండిపడ్డారు.. ముమ్మాటికి షర్మిల.. భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమే అంటూ ఆరోపణలు గుప్పించారు.. ఇక, పాదయాత్రలో షర్మిలపై జరిగిన దాడి ఘటనపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలకు కూడా స్పందించారు. షర్మిలపై జరిగిన దాడి, పోలీసులు తీరును ఖండించారు. ఇదే సమయంలో.. షర్మిల వ్యవహారంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా ఉదాహరణగా చూపుతూ వచ్చారు టీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో.. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీయే వైఎస్ షర్మిలకు ఫోన్ చేయడం చర్చగా మారింది.. ఇది పరామర్శల వరకే పరిమితం అయ్యిందా? మోడీ ఫోన్ కాల్ వెనుక ఇంకా ఏదైనా మతలాబు ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక, తనకు ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలిపారు.. ప్రధాని ఫోన్ చేసిన విషయంపై ఆమె స్పందిస్తూ.. థ్యాంక్యూ మోదీ జీ.. ఒక మోడీ మాత్రమే కాదు ఎంతో మంది స్పందించారని చెప్పుకొచ్చారు.. ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకోవడం, ఇలా అరెస్ట్ చేయడం అన్యాయమని చాలా మంది సానుభూతి వ్యక్తం చేశారన్నారు.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ శిబిరంలో కొంత సానుకూలత కనిపిస్తుంటే.. ప్రధాని మోడీ ఫోన్ చేయడం ఏంటి? అని ఆరా తీసేపనిలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!