Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rega Kantha Rao: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావుపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించి, మోసం చేశారంటూ ఓ యువతి నాంపల్లిలోని గౌరవ XIV అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. ఆమె నగరంలో ఓ పీజీలో నివసిస్తూ మీడియా రంగంలో పనిచేస్తోంది. 2022లో ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతా రావుతో పరిచయం ఏర్పడింది. కొత్త యూట్యూబ్ ఛానల్ నిర్మాణం పేరుతో మొదలైన ఈ పరిచయం, పెళ్లి చేసుకుంటాననే హామీతో క్లోజ్ రిలేషన్‌షిప్‌గా మారింది. అమీర్‌పేటలోని ఓ ఫ్లాట్‌లో కొన్నాళ్లు సహజీవనం చేసినట్లు, ఈ క్రమంలో తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
అంతేకాకుండా, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పేరుతో తన వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుని, ఆ తర్వాత నుంచి ముఖం చాటేశారని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఈ విషయంపై ఒత్తిడి తేగా, ఆయన అనుచరుల ద్వారా కొన్ని విడతలుగా రూ.8.5 లక్షలు బదిలీ చేసినప్పటికీ, తన సమస్య కేవలం డబ్బుకు సంబంధించింది కాదని.. నాలుగేళ్ల పాటు పెళ్లి పేరుతో మోసం చేసి శారీరకంగా దోపిడీ చేయడమేనని స్పష్టం చేసింది. గతంలో షీ టీమ్స్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా, రేగా కాంతా రావు తనపై ఎదురు ఆరోపణలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకూ, తన కుటుంబానికి ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. 2026 జూలై 26న అందిన ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 69, 351(2) కింద ఎఫ్ఐఆర్ (FIR 589/2026) నమోదు చేసి, కేసు విచారణను ఎస్ఐపీ నరసింగరావుకు అప్పగించారు. కాగా, ఈ ఆరోపణల నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Also Read
- Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
- UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్‌దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?