తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. అయితే ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖలతో పాటు వివిధ శాఖలలో ఖాళీల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 8 సంవత్సరాల తరువాత నోటిఫికేషన్లను విడుదల కావడంతో నిరుద్యోగులు రికార్డు స్థాయిలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. పురపాలక శాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు భర్తీకి అడుగులు పడుతున్నాయి.
పబ్లిక్ హెల్త్ లో 236, చీఫ్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై 420 పోస్ట్‌లు, ఇంజనీర్ ఇన్ చీఫ్ పంచాయతీ రాజ్ జనరల్ 350, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 223 చొప్పున ఆర్థిక శాఖ 1,433 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. అయితే ఈ రోజు వరకు ఆర్థిక శాఖ మొత్తం 35,220 పోస్టులకి అనుమతి ఇచ్చింది.