Telangana: వెనుకబడిన తరగతుల కుల, చేతివృత్తుల వారికి రూ.లక్ష సాయం నేటి నుంచి ప్రారంభం కానుంది. నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష ఇవ్వనున్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మంచిర్యాల వేదికగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆర్థిక సహాయం అందించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా.. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read also: White Hair: తెల్లజుట్టు నల్లగా మార్చుకోవాలంటే.. ఇలా చేయండి
ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని రూపొందించింది. పనిముట్ల కొనుగోలు, ఆధునికీకరణ, ముడిసరుకు కొనుగోలుకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,862 దరఖాస్తులు వచ్చాయి. బీసీ-ఏ నుంచి 2,66,001 మంది, బీసీ-బీ నుంచి 1,85,136 మంది, బీసీ-డీ నుంచి 65,310 మంది, ఎంబీసీల నుంచి 12,415 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతినెలా 5వ తేదీలోగా వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి అదే నెల 15న ఎమ్మెల్యే చేతుల మీదుగా సాయం అందజేయాలని నిర్ణయించారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన జూలై 18 నుంచి ప్రారంభమవుతుంది. రూ.లక్ష సహాయం పొందిన లబ్ధిదారులు తాము కొనుగోలు చేసిన పనిముట్లు లేదా ముడిసరుకు ఫోటోలను 30 రోజుల్లోగా అప్‌లోడ్ చేయాలి. ఆ యూనిట్ల గ్రౌండింగ్‌ను క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వృత్తి కులాలందరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చారిత్రాత్మక నిర్ణయంగా బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వృత్తుల అభివృద్ధికి, వృత్తిదారుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని కుల సంఘాల నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం పథక అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఆధునిక ఉపకరణాలు, ముడిసరుకులను కొనుగోలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం నెరవేరాలని అన్నారు. క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా కృషి చేయాలని తెలిపారు.
Yashasvi Jaiswal Century: సురేశ్ రైనా రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు!