MLA Raja singh: బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్య అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారు. తెలంగాణలో చిన్న…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియ ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని, అన్ని రాష్ట్రాల్లో కూడా కుల గణన చేయాలని డిమాండ్ రాబోతోందని తెలిపారు. ఈ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. భవిష్యత్‌లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి…
ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్సీ కవిత జవాబు చెప్పి ధర్నా చేయాలని తెలిపారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలను వంచించడమే కాకుండా వారికి అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందని ఆరోపించారు.
V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని కాంగ్రెస్ మాజీఎంపీ వి హనుమంతరావు అన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ బీసీలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Telangana: కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. నేటి నుంచి ఇంటింటికి కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్‌గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ…
సీఎం జగన్ (CM Jagan) బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అన్నారు. విజయవాడలో జరిగిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మచిలీపట్నంలో వైసీపీ సామాజిక సాధికార యాత్రలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని సీఎం జగన్ చెప్పారన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50 శాతం ఛాన్స్ ఇచ్చారు.. 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బీసీలమైన మేము జీరోలుగా ఉన్నాం.. మీ దృష్టిల్లో సున్నాలమైన మమ్మల్ని సీఎం జగన్ లీడర్లను, మంత్రులను చేశారు.
R. Krishnaiah: బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా అంటూ బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కామెంట్స్ సంచలనంగా మారాయి. ఖమ్మం అంటే విప్లవమని, అనుకరణ జిల్లా కాదు ఆదర్శవంతమైన జిల్లా అని అన్నారు. స్వతంత్రభావాలు గల జిల్లా ఖమ్మం జిల్లా అని తెలిపారు.