Yashasvi Jaiswal Century: సురేశ్ రైనా రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
13 Years Suresh Raina’s record was broken by Yashaswi Jaiswal: ఐపీఎల్ స్టార్ యశస్వి జైస్వాల్ అరంగేట్ర టెస్టులోనే భారీ సెంచరీతో చెలరేగాడు. 387 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 171 రన్స్ చేశాడు. ఇప్పటికే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన రికార్డు నెలకొల్పిన యశస్వి.. మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే విదేశీ గడ్డపై 150 కంటే ఎక్కువ రన్స్ చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా రికార్డు బద్దలు కొట్టాడు.
ఇప్పటివరకు సురేశ్ రైనా విదేశాల్లో అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. 2010లో కొలొంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో రైనా 120 రన్స్ చేశాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ శతకం బాది రైనా రికార్డును బద్దలు కొట్టాడు. అయితే భారత్ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మాత్రం శిఖర్ ధావన్ (187) ఉన్నాడు.
Also Read
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
Also Read: Asian Games 2023: భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరూ ఊహించరు! టీ20 టీమ్ ఇదే
వెస్టిండీస్‌పై 171 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై శిఖర్ ధావన్ 187 రన్స్ చేయగా.. వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 177 రన్స్ చేశాడు. ధావన్, రోహిత్ మాత్రమే యశస్వి కంటే ముందున్నారు. అయితే వీరిద్దరూ భారత పిచ్‌లపైనే సాధించడం విశేషం.
క్రికెట్ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్‌లో మొదటి సెంచరీ చేసింది చార్లెస్ బ్యానర్‌మాన్. 1877 మార్చి 15న ఆస్ట్రేలియా ఆటగాడు బ్యానర్‌మాన్ 165 రన్స్ బాది ఈ ఘతన సాధించాడు. ఇక లాలా అమర్‌నాథ్ తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. తొలి మూడు టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మాత్రమే. ఇక ఇప్పటివరకు 17 మంది భారత ఆటగాళ్లు తమ అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో సెంచరీలు చేశారు.
Also Read: WI vs IND: అశ్విన్ స్పిన్ మాయాజాలం.. తొలి టెస్టులో భారత్‌కు ఇన్నింగ్స్ విజయం!
తాజావార్తలు
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?