సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటులను మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇతర అధికారులు పరిశీలించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 న పీవీ రోడ్ నుంచి భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారని పేర్కొన్నారు. 1948 హైదరాబాద్ విలీనం తరువాత 75 సంవత్సరాల సందర్భంగా కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయని అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పచ్చబడ్డ ప్రాంతన్ని రక్తపాతం పరేలా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అన్ని వర్గాల వారు బాగుపడ్డారని గుర్తు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఈ సభలో లక్షలాది గిరిజనులు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో గిరిజనులపాత్ర ఏనాలేనిది అని కొనియాడారు. గిరిజనుల భవన్ ప్రారంభం తరువాత గిరిజనులు ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియంకి వస్తారని అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేబినెట్ లో తీర్మానం చేశామాన్నారు.
Ambati Rambabu: పోలవరం పూర్తికావడం టీడీపీకి ఇష్టంలేదా?