NTV Telugu Site icon

Asaduddin Owaisi: తెలంగాణలో ఏ పార్టీలతోనూ ఎలాంటి పొత్తు లేదు.. తేల్చేసిన ఒవైసీ

Oyc

Oyc

Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో పొత్తులపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేదని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఒవైసీ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలతో దేశానికి ఒడిగేది ఏమీలేదన్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగ విరుద్ధమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం సమానత్వ హక్కుకు విరుద్ధమని, ఈ చట్టాన్ని తాను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నానని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పీడీఎం కూటమి ఏర్పడిందని, తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read also: Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై దాడి ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరం

హైదరాబాద్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నాయని బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆరోపణలపై ప్రశ్నించగా… ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేశారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని బహదూర్‌పురా నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌ హషమాబాద్‌, అల్‌ జుబైల్‌ కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో సమావేశమయ్యారు. ఎంఐఎం పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను కోరారు. కాగా, హైదరాబాద్ పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి హైదరాబాద్ ఎంపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కాగా, తమిళనాడులో పళనిస్వామి నేతృత్వంలోని ఏఐడీఎంకేకు తాము మద్దతిస్తున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
BJP Manifesto: బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల..