పెళ్లి తర్వాత ప్రతి మగాడు తన వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకు తమ శరీరంలో ఎలాంటి బలహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.
పురుషుడు తండ్రి కావాలంటే అతని స్పెర్మ్ కౌంట్ కచ్చితంగా ఉండాలి. లేకుంటే సంతానోత్పత్తి బలహీనంగా మారి వైవాహిక జీవితం చేదుగా మారుతుంది.
అటువంటి పరిస్థితిలో పుచ్చకాయ పండు విత్తనాలు తప్పనిసరిగా స్పెర్మ్ కౌంట్ పెంచడానికి మీకు సహాయం చేస్తాయి.
పుచ్చకాయ గింజలు పురుషులకు స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది పురుషుల సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సిట్రులిన్ పురుషుల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
పుచ్చకాయ గింజల్లో ఉండే జింక్ పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. తండ్రులు కావడానికి ఎటువంటి అడ్డంకి లేకుండా చేస్తుంది.
పుచ్చకాయ గింజల్లో ఉండే గ్లూటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ పురుషులలో లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.
పురుషులు పుచ్చకాయ గింజలను తింటే, అది వారి సంతానోత్పత్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్పెర్మ్ సమస్య ఉన్నవారు ఈ పండు గింజలను తినాలి.
పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, సెలీనియం, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరానికి మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది.
పుచ్చకాయ గింజలను తినడం ఒక ఎంపిక. వాటిని ఎండలో బాగా ఎండబెట్టడం, వాటిని తినడం మరొక విధానం. మీకు నచ్చితే వాటిని కూడా వేయించుకోవచ్చు.
పుచ్చకాయ గింజలు ఎలా తిన్నకూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో పుచ్చకాయలు తింటే.. వాటి గింజలను అస్సలు తీసివేయకండి. తిని ప్రయోజనాలు పొందండి.