KTR: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ఓల్డ్ కలెక్టరేట్ వద్ద కళా భారతి భావన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ సందర్భంలో వచ్చినా అన్ని పరీక్షలకు నిజామాబాద్ నుంచే తిరుగులేని సమాధానం ఇవ్వాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. అంతేకాకుండా.. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ తో సహా జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాలు కూడా గెలుచుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సిద్దంగా వుండాలన్నారు. ఇక రాబోయే ఏడు నుంచి తొమ్మిది నెలపాటు నిర్విరామంగా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోపాటు ప్రజాహితమైన కార్యక్రమాల్లో అందరూ పనిచేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నిజామాబాద్ జిల్లాకు ఒక చక్కటి అపురూపమైన కానుక అందించాలని ఉద్దేశంతో రూ. 50 కోట్లతో ఒక అత్యుత్తమమైన కళాభారతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉందన్నారు.
Read also: Newborn Baby: తరుచూ ముద్దులు పెడితే ఏమవుతుందో తెలుసా..
Also Read
కాగా..తనకు తెలిసి తెలంగాణ మొత్తంలో ఎక్కడా లేనంత గొప్పగా ఇందూరు కళాభారతిని శంకుస్థాపన చేసుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కేటీఆర్. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తనను, ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్‌ని పిలిచి సమీక్ష నిర్వహించడం జరిగిందని గుర్తుచేశారు. ఈనేపథ్యంలో.. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఏం అవసరం ఉంది. ఇంకా ఏం చేయాలి అని అడిగారన్నారు. దానికి మేము ఎందుకు అని అడిగితే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌తో మొట్ట మొదట నడిచింది నిజామాబాద్ జిల్లా అని అన్నారు. ఆనాడు గులాబీ జెండా ఎత్తి మొత్తం తెలంగాణకు దిశ నిర్దేశం చేసింది నిజామాబాద్ జిల్లా అందుకే ఇక్కడ ఎంత చేసినా తక్కువనే అని కేసీఆర్ 936 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల రూపంలో మంజూరు చేశారని తెలిపారు కేటీఆర్. అంతేకాకుండా.. నిజామాబాద్ పట్టణ రూపురేఖలు మార్చే విధంగా ప్రజలకు సంతృప్తినిచ్చే విధంగా కార్యక్రమం చేయండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడే విధులు ఖర్చుపెట్టి చక్కగా చేయండని అన్నారు కేటీఆర్.
Read also: YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో విచారణ ముమ్మరం.. ఆ ఐదుగురికి సీబీఐ కోర్టు నోటీసులు
ఇక.. నిజామాబాద్ రైతులతో ముఖముఖిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని భూమా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక రైతుల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం వెలుగు నింపుతొందన్నారు కేటీఆర్. అంతేకాదు.. కరోనా లాంటి కష్ట సమయంలో అందరూ తల్లడిల్లుతుంటే రైతులకు ఇబ్బంది కాకుండా ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసామన్నారు. ఇక రాష్ట్రంలో 6 వేల రైతు వేదికలు ఏర్పాటు చేశాo. 5000 మందికి ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో.. రైతు వేడుకలు అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని రైతులకు సాగు నీటి అవసరాల కోసం 60 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించామని తెలిపారు కేటీఆర్. రాష్ట్రం లో భూగర్భ జలాలు పెంపొందించాం. అంతేకాకుండా.. ఎస్సారెస్పీ లాంటి ప్రాజెక్ట్ లకు పునరుజ్జివనం పోశాo. భారత దేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తక్కువ సమయంలో నిర్మించామన్నారు కేటీఆర్. పారిశ్రామిక అవసరాలకు 2050 వరకు జనాభా ఎంత పెరిగినా తాగునీటి సౌకర్యం ఉందన్నారు.
Read also:Anasuya Bharadwaj: టైట్ టీషర్టు.. లోపల “బ్రా”తో అనసూయ కనికట్టు
కాగా.. 24 గంటల కరెంట్, ప్రాజెక్ట్ ల వల్ల తెలంగాణలో యాసంగిలో మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. ఈనేపథ్యంలో.. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇవ్వటం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఇక తెలంగాణలో ప్రాజెక్ట్ ల నిర్మాణం వల్ల రెండవ నీటి విప్లవం ప్రారంభమైందన్నారు కేటీఆర్. అంతేకాదు.. ఆంధ్రలో చేపలు పెంచే విధంగా తెలంగాణలోనూ చెరువుల్లో చేపలు పెంచవచ్చని,నీటి వనరులు సంవృద్దిగా ఏర్పరుచుకున్నామని తెలిపారు కేసీఆర్. కాగా.. తెలంగాణ ఏర్పడిన నాడు వ్యవసాయ ఉత్పత్తులో 27 వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు మూడో స్థానానికి చేరుకుందని, ఇది కెసిఆర్ నాయకత్వంలో రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాల వల్లే సాధ్యమైందన్నారు కేటీఆర్. ఇక.. తెలంగాణలో నీలి విప్లవం ప్రారంభమైంది. అంతేకాకుండా.. దేశంలోనే చేపల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గాని నిలుస్తుందని అన్నారు.
Read also:BIG Breking: శంషాబాద్ ఎయిర్ పోర్టు.. విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం..
కాగా.. శ్వేత విప్లవానికి కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ఒకప్పుడు నష్టాల్లో ఉన్న విజయ డైరీ ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల లాభాల్లోకి వచ్చిందని.. పాడిపంట రెండు కలిస్తేనే రైతుకు ఆదాయం ఆ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు కేటీఆర్. ఇక దళిత బంధు ద్వారా అణగారిన వర్గాల ప్రజల జీవితాలు వెలుగులు నింపుతున్నామని, ఇతర రాజకీయ నేతల అబద్ధపు హామీలు ఇవ్వటo తమకు తెలియదన్నారు. అంతేకాదు.. పసుపు బోర్డు విషయంలో రైతులను ఇతర నాయకులు మోసం చేశారని, 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు అయ్యేవిధంగా రైతులను ప్రోత్సహించాం తద్వారా రైతుకు అధిక లాభాలు వచ్చి చేరుతాయి. కాగా.. హరిత విప్లవం నీలి విప్లవం గులాబీ విప్లవం పసుపు విప్లవం శ్వేత విప్లవం ఈ ఐదు విప్లవాల ద్వారా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. మన దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.
Kishan Reddy: 7 ఏళ్లలోనే గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో భారత్ 41 స్థానం
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!