YS Viveka Murder Case: వైఎస్ వివేకా కేసులో విచారణ ముమ్మరం.. ఆ ఐదుగురికి సీబీఐ కోర్టు నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ముమ్మరం చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. వివేకా హత్య కేసులో విచారణ ప్రక్రియ ప్రారంభించిన సీబీఐ కోర్టు.. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది.. వైఎస్ వివేకా హత్య కేసుకు SC/01/2023 నంబర్ కేటాయించింది సీబీఐ స్పెషల్ కోర్టు.. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, జి.ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి, డి.శివశంకర్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు ఇష్యూ చేసింది.. ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని నిందితులను ఆదేశించింది హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం..
Read Also: Somu Veerraju: ఏపీలో జగన్ నవరత్నాల కంటే.. మోడీ సంక్షేమమే ఎక్కువ..!
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయగా.. అందులో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు ప్రస్తుతం కడపలోని సెంట్రల్ జైల్‌లో ఉన్నారు.. మరోవైపు ఈ కేసులో ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఆయన.. లోటస్‌పాండ్‌లో వైఎస్ విజయమ్మను కలిసారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు అవినాష్‌రెడ్డి.. ఆయనకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. మొత్తంగా.. వైఎస్ వివేకా కేసులో తొలిరోజు నుంచే సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ ముమ్మరం చేసింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!