చిన్నపిల్లలను చూస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది.  లోకాన్ని మర్చిపోయేలా చేసే వారి అమాయకమైన నవ్వు, చూపులు వారిని క్షణ కాలం కూడా విడువకుండా చేస్తాయి.

కానీ చిన్న పిల్లల విషయంలో తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 

తల్లిగా మీరు సహజంగా మీ బిడ్డను పట్టుకుంటారు. ముద్దు పెడతారు. కానీ ఇంటి చుట్టు పక్కల వారందరూ బిడ్డను ఇలా తాకడం మంచిది కాదు. 

ముఖ్యంగా వారి బుగ్గలు, పెదాలపై అసలే ముద్దును పెట్టనీయకూడదు. ఇది కష్టమే అయినప్పటికీ.. ముద్దు పెడితే మీ బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. 

పిల్లలు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

అందుకే వారు తల్లికడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత వారిని ముద్దు పెట్టుకోకూడదు. 

ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు పిల్లలకు రాకుండా ఆపడానికి తల్లులతో సహా ప్రతి ఒక్కరూ శిశువులను ముద్దు పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. 

చర్మం ద్వారా సూక్ష్మక్రిములు చాలా తొందరగా వ్యాప్తి చెందుతాయి. అందుకే పిల్లలను అనవసరంగా ముట్టుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ముద్దు పెట్టుకోవడం ద్వారా శిశువుకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

పెద్దలు ముఖంపై చర్మ సంరక్షణ ఉత్పత్తులను లేదా మేకప్ ను ఉపయోగిస్తారు. దీనివల్ల పిల్లలకు ఎన్నో సమస్యలు వస్తాయి. శిశువులకు చర్మ సమస్యలను కలిగించే ప్రమాదకరమైన పదార్థాలు ఉంటాయి. 

గింజలు, సోయా లేదా ఇతర సాధారణ అలెర్జీ కారకాలు వంటి శిశువుకు అలెర్జీని కలిగిస్తాయి. 

ఈ ఆహార పదార్థాలను పెద్దలు తింటే.. శిశువుకు అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది.