బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెటిలర్లు అనే పదం తాను వాడనని.. ఇక్కడే పుట్టిన బిడ్డగా నాకెంత హక్కు ఉందో ఇక్కడ వచ్చి నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంటుందని అన్నారు. మెదక్ లో పుట్టి గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్లాకు వెళ్లిన పారాచుట్లు కల్వకుంట్ల కుటుంబమని దుయ్యబట్టారు.
అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికి పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. పాతవారిని పక్కన పెట్టి కొత్త వారికి సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ ఆనవాయితీ కాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా చేసుకుని ఎక్కడైనా అలాంటి నిర్ణయం జరిగినా నిరాశ పడవద్దు అని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మధుయాష్కి గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీలుగా, ఇతరత్రా పదవులు ఇచ్చే విధంగా నేరుగా పార్టీ అధిష్ఠానం నుంచి హామీ ఉండేలా చేస్తామని ఆయన చెప్పుకొచ్చాడు.
నిజామాబాద్ లో కాంగ్రెస్ బిసి గర్జన సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ పాల్గొన్నారు. తి పార్లమెంటు నియోజక వర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది అని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాం అని తెలిపారు.