Nizamabad Crime: మెస్ హాల్‌లోని బెంచ్‌పై కూర్చోవడంపై ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒక విద్యార్థి మరణించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలలో చోటుచేసుకుంది.
Read also: Bandi Sanjay: సచివాలయంలో అగ్ని ప్రమాదం.. క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే..
నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్‌కు చెందిన ఓవిద్యార్థి(14) బర్ధిపూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి, మరో విద్యార్థి మధ్యాహ్న భోజన సమయంలో మెస్ హాల్‌లోని బెంచ్‌పై కూర్చోవడానికి పోటీపడ్డారు. ‘నేనే ఫస్ట్ వచ్చాను, నేనే ఫస్ట్ వచ్చాను’ అని ఇద్దరూ వాదించారు. అయితే సదరు విద్యార్థి పడికిలి బిగించి మరో విద్యార్థిని బలంగా ఛాతీపై కొట్టడంతో విద్యార్థి కుప్పకూలపోయాడు. నేలపై బోర్లా పడ్డాడు. తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పడంతో.. కింద పడిన విద్యార్థిని లేపేందుకు ప్రయత్నించారు. విద్యార్థి అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్నాడు. భయాందోళన చెందిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఎండీ జమీల్‌కు చేరవేశారు.
Read also: Fire in New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
వెంటనే హుటా హుటిన బాధిత విద్యార్థిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చేదు వార్త చెప్పారు. విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారు. అయితే బాధిత తల్లి దండ్రులకు ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు ఆస్పత్రికి చేరుకున్న బాధితుడి తల్లి, కుటుంబీకులు, బంధువులు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కొడుకు మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది భిన్నమైన కథనాలు చెప్పడంతో కోపోద్రోక్తులైన బాధిత విద్యార్థి కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రిన్సిపాల్ తోసహా బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన బాధిత విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా డిచ్‌పల్లి ఎస్సై గణేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ClassRoom Tragedy : తరగతి గదిలో పురుగుల మందు తాగిన చిన్నారులు