Off The Record: నల్గొండ బీఆర్ఎస్ నేతలు అనాధలమైపోమంటూ ఎందుకు ఫీల్ అవుతున్నారు?
- ఉమ్మడి నల్గొండ కారులో నో సౌండ్స్..
- అడ్రస్ లేకుండా పోయిన ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యేలు..
- స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ జాగ్రత్తలు..
- బీఆర్‌ఎస్ మాజీల వైఖరిపై కేడర్ మండిపాటు..
- ఏడెనిమిది నియోజకవర్గాల్లో నాయకుల పూర్తి మౌనం..
- కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని కేడర్ ఆవేదన..
- యాక్టివ్‌గా ఉంటున్న నేతలకు చెక్‌పెట్టే ప్రయత్నాలు..
- ఉన్నచోట దిక్కులేదు,పక్క సెగ్మెంట్స్‌లో వేళ్ళు..
- రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు సైతం మౌనం..
- అనాధ బతుకైపోయిందని కేడర్ ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మేం అనాధలం అయిపోయాం… మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరంటూ….ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ కేడర్ ఆవేదనగా ఉందా? యుద్ధానికి మేం సిద్ధమంటున్నా… నడిపించే దళపతులు మాత్రం అస్త్ర సన్యాసం చేశారంటూ ఆగ్రహంగా ఉందా? ఏ జిల్లా లీడర్స్ కేడర్‌కు దూరం అయ్యారు? స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఆయుధాలు కిందపడేసి ఏం చేయాలనుకుంటున్నారు?
Read Also: Kothwalguda Eco Park: త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి కొత్వాల్‌గూడ ఎకో పార్క్..
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. బీఆర్ఎస్ క్యాడర్ పరిస్థితి వెన్న తిన్నవాడు వెళ్లిపోతే.. చల్ల తాగిన వాడిని చావ మోదినట్లు తయారైందట. ఒక వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్ధల ఎన్నికల కోసం.. వరుసగా గ్రామ, మండల, నియోజకవర్గ స్దాయి సమీక్షా సమావేశాలు పెట్టుకుంటుంటే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో మాత్రం ఆ సౌండే లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా అంత మొనగాళ్ళు లేరని మీసాలు తిప్పిన మాజీలంతా.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారట. వాళ్ళు అనుభవించాల్సిందంతా అనుభవించేసి.. మమ్మల్ని అనాధల్ని చేశారంటూ వాపోతోందట కేడర్. సాధారణంగా అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుందని అంటారు. అలాంటిది పవర్ ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్‌లుగా ఉన్న.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం బాధ్యతారహితంగా ఉన్నారని కేడర్ మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారట గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు. తాజాగా ఆ గ్యాప్ మరింతగా పెరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: IND vs ENG: సెంచరీతో బౌలర్లకు చుక్కలు చూపించిన యశస్వి జైస్వాల్..రికార్డుల మోత..!
ఇక, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మునుగోడు, కోదాడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాలకు చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతలు తమను నడిపించే నాయకుడి కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అటు హుజూర్ నగర్ లో కారు పార్టీ క్యాడర్ ఏడాదిన్నరకు పైగా స్టీరింగ్ పట్టుకునే డ్రైవర్ కోసం ఎదురు చూస్తోంది. మరో ఇద్దరు, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం క్యాడర్‌కు టచ్ లో ఉంటుండగా.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అప్పుడప్పుడూ నియోజకవర్గాన్ని, జిల్లాను చుట్టేస్తున్నారట.. స్థానిక సంస్ధల ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధం అవుతన్న వేళ.. ఎమ్మెల్యేలు, గ్రామస్థాయి నేతలతో వరస మీటింగ్‌లు పెట్టుకుంటుంటే.. బీఆర్ఎస్ మాత్రం కనీసం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం పెట్టుకపోవడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి నాయకులు. ఎలాగూ అధికారంలో ఉన్నప్పుడు అయినోళ్లకు ఆకుల్లో కానోళ్లకు కంచాల్లో పెట్టారు. ఇప్పుడైనా పార్టీని అంటిపెట్టుకుని, పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లతో ఒక్కసారి మీటింగ్ పెట్టండి.. మనస్సువిప్పి మాట్లాడుకుందాం అంటున్నారట కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు. చెయ్యాల్సిన పని చేయకపోగా.. కొందరు మాజీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గంలో కాస్త యాక్టివ్‌గా ఉన్న నేతలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోందట.
అయితే, ఇంకొందరు మాజీలైతే తమ నియోజకవర్గాన్ని వదిలి.. పక్క సెగ్మెంట్‌లో రాజకీయాలు చేస్తున్నారని, దాంతో అక్కడ వర్గ పోరుకు బీజం పడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి గులాబీ వర్గాల్లో. దీంతో గోరంత ఆలస్యం కొండంత నష్టం కలిగిస్తుందని, లాస్ట్ మినిట్‌లో నిర్ణయం తీసుకున్నా.. పరిస్థితులు మనవైపునకు తిరగడానికి మనమేం అధికారంలో లేమంటూ.. కొందరు గులాబీ నేతలు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే.. తీరా సమయం దగ్గరపడ్డాక ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఉంటుందని సూటిగా చెప్తేస్తున్నారట. కవలం మాజీ ఎమ్మెల్యేలే కాదు.. రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వారు సైతం అడ్రస్ కూడా లేకుండా పోయారట.. ఇక ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్ లు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాకు టిక్కెట్ కావాలని వేరు కుంపట్లు, రహస్య సమావేశాలు పెట్టిన నేతలు.. వ్వరూ పట్టించుకోకుండా వదిలేయడంతో.. అనాధ బతుకైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది కేడర్. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సమరం కోసం.. సైనికులు కత్తులు తిప్పుతూ సిద్ధంగా ఉంటే.. వ్యూహరచన చేయాల్సిన దళపతులు మాత్రం అస్త్ర సన్యాసం చేయడం పార్టీ పెద్దల్ని కూడా కలవరపెడుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!