Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wheat Flour Soup Recipe: చలికాలంలో రాత్రి భోజనం విషయంలో చాలామంది జాగ్రత్త పడుతుంటారు.. వీలైనంత వరకు లైట్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతారు.. తేలికపాటితో వేడివేడి ఆహారం కావాలంటారు.. అయితే, ప్రతిరోజూ గోధుమ రొట్టెలు, కూరగాయలతో భోజనం చేసి విసుగెత్తిపోయిన వారికి గోధుమ పిండి సూప్ మంచి ప్రత్యామ్నాయం. గోధుమ పిండి, వెన్న, వెల్లుల్లి, తాజా కూరగాయలతో తయారయ్యే ఈ సూప్ ఎంతో రుచిగా ఉంటుంది. క్రీమీగా, చిక్కగా ఉండే ఈ సూప్ కడుపు నింపడంతో పాటు చలికాలంలో వేడివేడి ఆహారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ఇంట్లోనే తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ గోధుమ పిండి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం.
గోధుమ పిండి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
* గోధుమ పిండి – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
* వెన్న లేదా దేశీ నెయ్యి – 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
* సన్నగా తరిగిన వెల్లుల్లి – 1 టీస్పూన్
* సన్నగా తరిగిన కూరగాయలు – అర కప్పు
* పాలు – అర కప్పు (ఐచ్ఛికం)
* నీరు లేదా వెజిటబుల్ స్టాక్ – 2 నుంచి 2.5 గ్లాసులు
* నల్ల మిరియాల పొడి – అర టీస్పూన్
* వేయించిన జీలకర్ర పొడి లేదా ఒరేగానో – అర టీస్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
* కొత్తిమీర – కొద్దిగా
Also Read
- Supreme Court: జంక్ ఫుడ్‌పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా 'హై ఫ్యాట్, షుగర్, సాల్ట్' హెచ్చరికలు..
- Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
- Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో 'మష్రూమ్ పులావ్'..!
- Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
గోధుమ పిండి సూప్ తయారీ విధానం
– ముందుగా ఒక బాణలి లేదా కడాయిని స్టవ్‌పై పెట్టి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత గోధుమ పిండిని వేసి తక్కువ మంటపై బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా చేయడం వల్ల సూప్‌కు మంచి రుచి, సువాసన వస్తాయి. ఇప్పుడు వేయించిన పిండిలో ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, మొక్కజొన్న వంటి కూరగాయలను వేసి వెన్నలో ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత పిండి ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ రెండు గ్లాసుల నీటిని లేదా వెజిటబుల్ స్టాక్‌ను నెమ్మదిగా పోయాలి. సూప్ మరింత క్రీమీగా ఉండాలనుకుంటే అర కప్పు పాలు కూడా కలపాలి. తర్వాత తగినంత ఉప్పు, నల్ల మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి లేదా ఒరేగానో వేసి బాగా కలపాలి. మధ్యస్థ మంటపై సుమారు 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. సూప్ కొద్దిగా చిక్కబడి, మంచి మెరుపుతో కనిపించే వరకు ఉడికిస్తే సరిపోతుంది.
వేడివేడిగా సర్వ్ చేసుకోండి!
చివరగా సూప్‌పై కొద్దిగా వెన్న, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. అనంతరం ఒక గిన్నెలోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన గోధుమ పిండి సూప్ సిద్ధం. చలికాలంలో రాత్రి భోజనంగా లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా దీనిని ఆస్వాదించవచ్చు. మీకు నచ్చిన కూరగాయలను జోడించుకోవడం ద్వారా రుచిని మరింత పెంచుకోవచ్చు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
-
Kenishaa : జయం రవి వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఆ రోజు కోర్టుకు రాకపోతే అంతే!
-
Asaduddin Owaisi: ముస్లిం వ్యక్తే డిప్యూటీ సీఎం..!
-
Alias Rukmini : అమ్మాయి పేరుతో నితిన్ ‘కోరికలే గుర్రాలైతే’ పుస్తకాలు! ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ అదిరిందిగా!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!