హైదరాబాద్ లో మరో హత్య జరిగింది. సరూర్ నగర్ లో నాగరాజు హత్య ఘటన మరవక ముందే మరో పరువు హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అక్కసుతో నీరజ్ పన్వార్ అనే యువకుడిని అత్యంత విచక్షణారహితంగా పొడిచిపొడిచి హత్య చేశారు. ఈ ఘటన బేగంబజార్ షాహీనాథ్ గంజ్ లో చోటు చేసుకుంది. రెండు బైకులపై వచ్చి యువకులు ప్లాన్ ప్రకారం నీరజ్ పన్వార్ ను 20 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు…
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన నాగరాజు అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు.. వికారాబాద్ జిల్లాలోని అతని స్వగ్రామంలో.. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్ర సాగింది.. నాగరాజును హత్య చేసినవారిని ఎన్‌కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు గ్రామస్తులు.. అంత్యక్రియల తర్వాత ఎన్టీవీతో మాట్లాడిన నాగరాజు భార్య ఆశ్రీన్.. తాను అన్నవాళ్ల దగ్గరికి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులు తనతో సఖ్యతగానే వుంటున్నారని.. పెళ్లి చేసుకున్నా తనను ఒక్క మాట కూడా అనలేదని వెల్లడించింది ఆశ్రీన్. Read…
సరూర్ నగర్ పరువు హత్యపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకే ఈ హత్య జరిగిందని ఆరోపించిన ఆయన.. ఈ హత్య చేసిన వ్యక్తుల్ని, అలాగే వారి వెనకున్న శక్తుల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా మతపరంగా జరిగిన హత్యగానే బీజేపీ భావిస్తోందన్నారు. ఈ కిరాతకమైన ఘటనపై సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లవ్ జిహాద్…