కేసీఆర్ రాష్ర్టంలో రహస్యంగా పర్యటించాలంటూ కాంగ్రెస్ సీనియర్‌నేత జగ్గారెడ్డి అన్నారు. గతంలో ఎంతో మంది రాజులు ఇలాగే చేశారన్నారు. అప్పుడే రైతుల సమస్యలు తెలుస్తాయన్నారు. వరిధాన్యం కొనకుండా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఎవ్వరికి తెలియకుండా పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయన్నారు.
ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం అధికార పార్టీతో పోరాటం చేస్తుందన్నారు. ఎప్పుడైనా ప్రజల తరపున నిలబడేదని కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఇప్పటికైనా కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు మాని రైతులు ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి కుప్పల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగ్గారెడ్డి అన్నారు.