MLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. నన్ను చంపేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh Controversial Comments On Love Jihad: ‘డేట్ రాసి పెట్టుకోండి.. నన్ను వందకు వంద శాతం చంపేస్తారు’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం గురించి మాట్లాడుతున్న తనపై ఇవాళ కాకపోయినా రేపు బుల్లెట్లను ఉపయోగిస్తారని.. ఈ విషయం తనక్కూడా తెలుసని కుండబద్దలు కొట్టారు. ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని, ముస్లిములుగా కన్వర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘లవ్ జిహాద్’ పేరుతో హిందూ యువతులను పిల్లలను కనే మిషన్లుగా తీర్చిదిద్దుతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో హిందువులతోనే హిందువులపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నారన్నారు.
ధర్మం కోసం ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారో.. వారి గొంతులు, తలలు నరుకుతున్నారని ఆరోపణలు చేశారు. ధర్మం గురించి మాట్లాడుతున్న తనని కూడా ఏదో ఒకరోజు మట్టుబెడతారన్నారు. అయితే.. చచ్చేముందు తనదొక కల ఉందని, అందరూ తనలాగే తయారవ్వాలని, ఇదే తన సంకల్పమని రాజాసింగ్ పేర్కొన్నారు. తాను ఛత్రపతి శివాజీ హిస్టరీ చదివానని.. బతకాలంటే ఆయనలా బతకాలని, చావాలంటే ఆయన కొడుకు శంభూజీలాగా చావాలని అన్నారు. ఇది కేవలం తన ఒక్కడి కల మాత్రమే కాకూడదని, ప్రతి ఒక్క హిందువు కల కావాలని పిలుపునిచ్చారు. అందరూ ధర్మ రక్షణకు పాటుపడాలని, లేకపోతే హిందువులంతా రేపు కన్వర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కామెంట్స్ చేశారు.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
రాజకీయం వేరు, ధర్మం వేరు అని చెప్పిన రాజాసింగ్.. ‘‘మీరు ఏ పార్టీలో ఉండాలనుకుంటారో అది మీ ఇష్టం, ఏ పార్టీలో ఉన్నా ధర్మాన్ని రక్షించొచ్చు, మీ ఆలోచనల్లో కొన్ని మార్పులు తెస్తే చాలు’’ అని అన్నారు. ధర్మాన్ని రక్షించాలంటే.. బీజేపీలోనే ఉండాలనే రూల్ ఏమీ లేదన్నారు. ఎందుకంటే.. టీఆర్ఎస్‌లో, కాంగ్రెస్‌లో ఉంటే పూజలు చేయరా? అని ప్రశ్నించారు. జై శ్రీరామ్ అంటే బీజేపీ అనే ముద్ర ఎందుకు? రాముడు బీజేపీకి మాత్రమే చెందినవాడా? టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి కాదా? అంటూ నిలదీశారు. లవ్ జీహాదీని ఆపండి? మత మార్పిడిని అడ్డుకోండని రాజాసింగ్ ప్రతి రాజకీయ నాయకుడిని కోరారు.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!