Vemula Prashanth Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా… ఇది కేసిఆర్ అడ్డా…నోరు అదుపులో పెట్టుకో బిడ్డా అంటూ హెచ్చరించారు. పదే పదె అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావ్..అది నోరా.. మోరా అంటూ మండిపడ్డారు. వచ్చిన ప్రతిసారీ తెలంగాణ అభివృద్ది మీద విషం చిమ్మే మాటలే చెప్తున్నవ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి గుజరాత్ గులాంలు రాసిచ్చిన పాత స్క్రిప్ట్ నే ఎన్ని సార్లు చదువుతవ్..? అంటూ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందా..? ఆ మాట అనడానికి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు.
కేసిఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లకు నీ బీజేపీ కేంద్ర సర్కారు పైసలు ఇయ్యకున్న..అవార్డులు ఇస్తుంది నీకు తెలుసా…? అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12వేల కోట్లు ఖర్చు పెడితే…మీరు కొసిరి కొసిరి ఇచ్చింది బోడి 1200 కోట్లు అంటూ లెక్కలతో సహా తెలిపారు. నేషనల్ హైవేస్ కోసం కాగితాల మీద 1లక్ష 21వేల కోట్లు మంజూరు చేసి 9ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 19 వేల కోట్లే అంటూ మండిపడ్డారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుండి టోల్ టాక్స్, సెస్ ల ద్వారా ముక్కు పిండి వసూలు చేసిన పైసలే..మీరు ఇచ్చింది ఏంది..? అంటూ ప్రశ్నించారు. ఈ లెక్కన తెలంగాణలో ఇంకో 30 ఏళ్లకు ఇప్పుడు మంజూరు చేసిన పైసలు ఖర్చు చేస్తారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసిఆర్ రైతు బంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు కండీషన్లా…సిగ్గు చేటు? అంటూ మండిపడ్డారు. కేసిఆర్ ప్రభుత్వం తెలంగాణలో రైతు బంధు కింద 49లక్షల మంది రైతులతో మొదలు పెట్టి…నేడు అది 70 లక్షల మంది రైతులకు చేరుకుందని అన్నారు.
కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి మొదట 35లక్షల మంది రైతులకు ఇచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టి ప్రస్తుతం 29 లక్షల మంది రైతులకే కేంద్రం 2వేలు ఇస్తుందని గుర్తు చేశారు. కేంద్రం ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 29 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు 9వేల కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 70లక్షల మంది రైతులకు ఈ సీజన్ వరకు 72వేల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ధరణి ని రద్దు చేసి.. మళ్ళీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి రైతులను గోస పెడదామనే ఆలోచన బీజేపీ ది అని తీవ్రంగా ఆరోపించారు. కేసీఆర్ “అబ్ కి బార్ కిసాన్ సర్కార్” అని రైతులకు ఆసరగా నిలబడితే..బీజేపీ హరిగోస పెడుతుందని మండిపడ్డారు. పేదలు,రైతులు రెండు కండ్లుగా పని చేస్తున్న కేసిఆర్ ని జైల్లో పెడతారా…? అంటూ మండిపడ్డారు. పంచభూతాలను అమ్మకానికి పెట్టి, దేశ సంపద తన మిత్రులకు దోచి పెడుతున్న నరేంద్ర మోడీని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలి..? అని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM KCR: 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్.. మహారాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్