హైదరాబాద్ పీవీ మార్గ్‌లోని నెక్లెస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పతంగుల పండుగను సంక్రాంతి ముందు నుంచే ఎంతో ఘనంగా జరుపుకుంటారని ఆయన వెల్లడించారు.
Read Also: గాలిపటం కోసం కరెంట్ పోల్ ఎక్కి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న బాలుడు
విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల ప్రజలు మన సంప్రదాయాలు మర్చిపోతున్నారని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. మన ఆచారాలు, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని తలసాని పిలుపునిచ్చారు. పండుగల విశిష్టతను పిల్లలకు తల్లిదండ్రులే విడమర్చి చెప్పాలని ఆయన సూచించారు. కాగా సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పతంగులను ఎగురవేస్తున్నారు.