Ponnam Prabhakar : రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో అని కల్ల మంటతో ఆరోపణలు
- ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బీఆర్ఎస్ నేతలకు కళ్ళ మంట
- రేవంత్ రెడ్డిది వ్యక్తిగత పర్యటన కాదు.. అధికారిక పర్యటన
- కేటీఆర్ అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేశారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలు బాగుండద్దు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బీఆర్ఎస్ నేతలకు కళ్ళ మంట లాగ కనిపిస్తుందని రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వ్యక్తిగత పర్యటన కాదు.. అధికారిక పర్యటన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికా వెళ్లి డెలిగేశన్స్ నీ కలుస్తున్నారన్నారు. రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో అని కల్ల మంటతో అనేకమైన ఆరోపణలు చేస్తున్నారని, మేము సవాలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 సంవత్సరాలుగా ఫాం హౌస్ నుండి కనీసం సెక్రటేరియట్ కి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్లు ఉంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజా పాలన పేరు మీద బాగు చేయాలని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్న తీరును ప్రజలు ఆలోచన చేయాలని, ప్రభుత్వ పర్యటనలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలు ముందడుగు పడుతుంటే కుటుంబపరమైన అంశాలు ప్రస్తావిస్తూ దానిని చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్ అనేక సందర్భాల్లో విదేశీ పర్యటనలు చేశారని, గత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏనాడూ నిధులు తీసుకురావాలనే ఆలోచన చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
EC: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం? త్వరలోనే ఈసీ నోటిఫికేషన్!
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
అంతేకాకుండా..’వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారు..మంచిది కాదు.. బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.. నమస్తే తెలంగాణ పేపర్ లో నిలువునా విరిగిపడ్డ సుంకి శాల కోడ కూలీ తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అంటున్నారు.. ఈ పని జరిగింది బీఆర్ఎస్ హయంలో.. దీనికి సంబంధించిన కారణాలపై విచారణకు అదేశిస్తున్నం.. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు హైదారాబాద్ ఇంచార్జి మంత్రి గా నీళ్ళు హైదారాబాద్ కి తీసుకొచ్చే ప్రక్రియ లో భాగంగా మున్సిపల్ ,hmda, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను పూర్తిగా విచారణకు అదేశిస్తున్నాం. దీనికి కారణం పూర్తిగా దోషి బీఆర్ఎస్.. మీరు విచారణకు సిద్ధమా…? ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు .. బీఆర్ఎస్ తప్పులను ప్రజల ముందు చూపెడతాం.. మసిపూసి బట్ట కాల్చి మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు.. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.. బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.. మొన్ననే కాళేశ్వరం కి సంబంధించి లోప భూయిస్ట నిర్ణయాలతో తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది.. రైతు వేధికల్లో రైతులు చెబుతున్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతులకు వచ్చిన ప్రయోజనాలు గత 10 ఏళ్లలో రాలేదంటున్నారు..
Samantha : నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఒంటరి వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలంటూ సమంత సంచలన పోస్ట్
తెలంగాణ ఏర్పడ్డ తరువాత బాగవుతుందనుకున్నం .అంత హీనంగా జరిగిందని రైతులే స్వయంగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ ఒకటో తారీఖు జీతాలు ఇస్తూ ,రుణమాఫీ చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకీ శాల పై కూడా విచారణకు ఆదేశిస్తున్నం..సమగ్రమైన రిపోర్ట్ తెప్పించ్చుకొని ఆనాడు బీఆర్ఎస్ హయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటాం.. సాంకేతిక పరమైన నివేదికలతో మీ ముందుకు వస్తాం. ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం.. బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడి అసెంబ్లీ లో సోషల్ మీడియా లో గిరిజన మహిళా అని చూడకుండా సోషల్ మీడియా లో పోస్ట్ లు చేశారు.. అసందర్భమైన ఆరోపణలతో శాసన సభ లో సరైన విధంగా జవాబులు చెప్పలేక.. స్పీకర్ గారు దళితుడు అని దొర తనంతో అధ్యక్ష అని పిలువలేక శాసన సభకు రాలేకపోయారు..
ప్రజలు అన్ని గమనిస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో గ్యారంటీ స్కీమ్స్ అమలు కానీ 200 యూనిట్ల లబ్ధి జరగని వారిని,500 గ్యాస్ రాని వారిని కరెక్షన్ చేసుకొమ్మని చెప్తున్నాం.. రైతు రుణమాఫీ రాని వారి వివరాలు సేకరిస్తున్నాం.. ఒక భీమదేవరపల్లి మండలంలో 21 కోట్లు రైతు రుణమాఫీ వచ్చింది . 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడే రుణమాఫీ అమలు చేశాం. పార్లమెంట్లో సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత వారి ఆసహనానికి హద్దు లేకుండా పోయింది.. ప్రజా సమస్యల పై మాట్లాడాలని జ్ఞానం లేకుండా ఎది పడితే అది మాట్లాడుతున్నారు.. మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దోషులను శిక్షిస్తం.. బరబార్ జవాబు చెప్తాం.. రుణమాఫీ కాని వారిని నిలదీయాలని కిషన్ రెడ్డి చెప్తున్నారు.. బీఆర్ఎస్ బీజెపి వేరువేరు కాదు.. ప్రజలు మిమ్మల్ని వేరు వేరుగా చూడలేదు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడ చేతకాని మంత్రివి. రైతులకు అన్యాయం జరిగింది అంటున్నావు… మీది బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నావ్ రైతులకు రుణమాఫీ రాకపోతే వ్యవసాయ అధికార దగ్గర వివరాలు ఇవ్వాలని చెప్తున్నాం.. రైతులకు న్యాయంగా ఉంది అన్యాయం జరిగితే ఆ సమస్యల పరిష్కరించే బాధ్యత మాది.. ప్రజా పాలన ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వం ది.. కేసీఆర్ మాటలు మీ రూపంలో చెప్పుకునే ప్రయత్నం మానుకో కిషన్ రెడ్డి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజావార్తలు
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!