Samantha Insta story before Sobhita Dhulipala Naga Chaitanya Engagement goes viral: చాలాకాలం పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సమంత నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత వీరు విడిపోవడానికి కారణాలు అంటూ అనేకం తెరమీదకు వచ్చినా ఏ విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందులో ప్రధమ ఘట్టంగా ఈరోజు వీరిద్దరికి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున అధికారికంగా ప్రకటించాడు.
Naga Chaitanya: ఎంగేజ్మెంట్ కి ముందు సమంత ఫోటోలు డిలీట్ చేసిన నాగ చైతన్య?
అయితే చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌కు ముందు సమంత చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు.. ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి..’ అంటూ సమంత రాసుకొచ్చింది. అయితే.. సమంత ఈ పోస్ట్ వినేష్ ఫోగట్ గురించి పెట్టింది. ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే.. సామ్ ఉద్దేశం వేరే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వినేష్ ఫోగట్‌తో పాటు పరోక్షంగా తన జీవితాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ చేసిందని.. చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ నేపథ్యంలోనే సమంత ఈ పోస్ట్ పెట్టినట్టుగా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. చై, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చారనే చెప్పాలి.