WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WI vs PAK: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ట్రినిడాడ్‌లోని టరౌబాలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ ఫలితంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విజయంతో వెస్టిండీస్ అట్టడుగు స్థానం నుంచి బయటపడగా.. పాకిస్థాన్ చివరి స్థానానికి పడిపోయింది.
తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేసింది. షాయ్ హోప్ 92 పరుగులు, కవెమ్ హాడ్జ్ 84 పరుగులతో జట్టును ఆదుకున్నారు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ అలీ 4, మహ్మద్ అబ్బాస్ 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ప్రత్యుత్తరంగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే ఆలౌటైంది. షాన్ మసూద్ 109 పరుగులతో సెంచరీ చేయగా.. ఇమామ్ ఉల్ హక్ 63 పరుగులు చేశాడు. వెస్టిండీస్ తరఫున జస్టిన్ గ్రీవ్స్ 5 వికెట్లు తీశాడు.
Also Read
- Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
- Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 181 పరుగులు చేసి పాకిస్థాన్‌కు 211 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. షమర్ జోసెఫ్ 38 పరుగులు చేయగా, మహ్మద్ అబ్బాస్ 5 వికెట్లతో పాకిస్థాన్‌కు ఆశలు కల్పించాడు. అయితే 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. బాబర్ ఆజమ్ ఒక్కడే 58 పరుగులతో పోరాడగా.. మిగిలిన బ్యాటర్లు వరుసగా చేతులెత్తేశారు. జేడెన్ సీల్స్ 5 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్‌ను కేవలం 120 పరుగులకే కుప్పకూల్చాడు.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మరో 2 వికెట్లు తీసిన జస్టిన్ గ్రీవ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో వెస్టిండీస్ WTC 2025-27 పాయింట్ల పట్టికలో 11 టెస్టుల్లో 2 విజయాలు, 7 ఓటములు, 2 డ్రాలతో 22.73% (PCT) సాధించి 8వ స్థానానికి చేరుకుంది. మరోవైపు పాకిస్థాన్ ఐదు టెస్టుల్లో ఒకే ఒక్క విజయం, నాలుగు ఓటములతో 6.66% PCTతో 9వ స్థానానికి పడిపోయింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో పాకిస్థాన్ దాదాపు నిష్క్రమించినట్లే.
తాజావార్తలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!