KTR Tour: నేడు వరంగల్‌కు మంత్రి కేటీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలను చుట్టేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్న మంత్రి కేటీఆర్.. ఇవాళ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.. వచ్చే నెలలో రాహుల్ గాంధీ పర్యటన, కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనుండగా… అంతకు ముందు కేటీఆర్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.. ఇక, కేటీఆర్ పర్యటన ముగిసిన తర్వాత రెండు రోజుల్లో.. టి.పీసీసీ నేతలు వరంగల్‌లో పర్యటించి రాహుల్ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ఇవాళ్టి వరంగల్, హనుమకొండ, నర్సంపేట పర్యటనల్లో 236 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఎటు చూసినా జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓరుగల్లు గులాబీమయంగా మారిపోయింది.
కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..
* ఉదయం 9.15 గంటలకు వరంగల్ ఆర్ట్, సైన్స్ ప్రాంగణానికి చేరుకోనున్న కేటీఆర్..
* ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..
* ఉదయం 10.10 గంటలకు స్మార్ట్ రోడ్డు ఆర్ -4 ప్రారంభోత్సవం
* ఉదయం 10.20 నుంచి 10.30 గంటల వరకు రీజినల్ గ్రంథాలయం ప్రారంభం
* ఉదయం 10.40 గంటలకు స్మార్ట్ రోడ్డు ఆర్ -4 ప్రారంభం
* ఉదయం 10.50 నుంచి 11.20 గంటల వరకు పబ్లిక్ గార్డెన్లో చేపట్టిన వివిధ పనుల ప్రారంభం
* ఉదయం 11.30 గంటలకు హెలీక్యాప్టర్‌లో నర్సంపేట బయల్దేరనున్న కేటీఆర్..
* మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు చేరుకోనున్న మంత్రి..
* మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 వరకు నర్సంపేట మునిసిపాలిటీ కార్యాలయంలో వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
* మధ్యాహ్నం 12.30 నుంచి 12.40 గంటల వరకు అశోక్ నగర్‌లో పైపుల ద్వారా గ్యాస్ పంపిణీ ప్రారంభం
* మధ్యాహ్నం 12.40 నుంచి 1.30 వరకు బైపాస్ రోడ్డులో బహిరంగ సమావేశం
* మధ్యాహ్నం 1.30 గంటలకు నర్సంపేట నుంచి ఆర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు .
* మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇంటిలో భోజనాలు
* మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు హన్మకొండ కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతిపై రివ్యూ
* సాయంత్రం 4 నుంచి 4.20 గంటల వరకు సర్యూట్ గెస్ట్ హౌజ్ సమీపంలోని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇంటిలో టీ బ్రేక్
* సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్
* సాయంత్రం 6 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరనున్న మంత్రి కేటీఆర్.
Also Read
- Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
- Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!